సోలో హీరోగానే కాకుండా కొండపల్లిరాజా, బావ బావమరిది వంటి మల్టీస్టారర్ సినిమాల్లో కూడా నటించారు. కేవలం హీరోగానే కాకుండా దేవుడి అన్నమయ్య సినిమాతో దేవుడి పాత్రల్లో కూడా అద్భుతంగా నటించగలరని ప్రూవ్ చేశారు. అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వర స్వామిగా నటించారు. హీరోగానే కాకుండా కీలక పాత్రల్లో కూడా నటించడం మొదలుపెట్టారు. అలా దేవుళ్ళు, లాహిరి లాహిరి లాహిరిలో, నీకు నేను నాకు నువ్వు, కళ్యాణ రాముడు, గంగోత్రి వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. 2007 లో శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ ది బాస్ సినిమాలో విలన్ గా నటించారు. ఆ తర్వాత ఠాగూర్ హిందీ రీమేక్ గబ్బర్ ఈజ్ బ్యాక్ లో విలన్ గా నటించారు. విలన్ గానే కాకుండా లీడర్, దూకుడు, లెజెండ్, సరైనోడు వంటి సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో చాలా సినిమాల్లో నటించారు.
ఇక సుమన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, ఆయన పూర్తి పేరు సుమన్ తల్వార్. ప్రముఖ తెలుగు రచయిత డి.వి. నరసరాజు గారి మనవరాలు అయిన శిరీషను వివాహం చేసుకున్నారు సుమన్. వీరికి ఒక కూతురు కూడా ఉంది. పేరు అఖిలజ ప్రత్యూష. ఏమే ఒక గొప్ప నృత్యకారిణి. చిన్న వయసులో ఆమె అమ్మమ్మ గారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నారు. పలు స్టేజ్ షోస్ లో కూడా ఈమె ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత చదువు మీద దృష్టి పెట్టారు. అయితే ఈమెకు సినిమాల మీద అస్సలు ఇంట్రస్ట్ లేదని, చదువు మీద ఆసక్తి ఉందని ఒక ఇంటర్వ్యూలో సుమన్ వెల్లడించారు. చదువు మీద ఆమెకు ఇంట్రస్ట్ ఉన్న కారణంగా ఆమెను పై చదువులు చదివిస్తున్నారు. ఆమె ఇటీవలే ఎంఎస్సి పూర్తి చేశారు. ఆడపిల్ల అంటే చాలా మంది టెన్షన్ అనుకుంటారు, కానీ నా విషయంలో మాత్రం ఆడకూతురు అంటే టెన్ సన్స్ తో సమానం అని సుమన్ ఇంటర్వ్యూలో కూతురు గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి