
ఇక ఈ పోస్టర్ ను పవర్ స్టార్ తన ఇన్ స్టాగ్రాం ద్వారా షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ పోస్టర్ తో అనీల్ అండ్ భాను ఆయన మీద అభిమానాన్ని చూపించారు. తెలుగులో చాలా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్స్ గా ఉంటున్న అనీల్ అండ్ భాను పవన్ కోసం చేసిన ఈ పోస్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు రాగా ఆ తర్వాత క్రిష్ సినిమా లైన్ లో ఉంది. క్రిష్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న సినిమాలో పవన్ నటిస్తున్నాడని తెలుస్తుంది. పవన్, రానా ఇద్దరు కలిసి ఈ సినిమా చేస్తున్నారు.