సినీ ఇండస్ట్రీ లో ఏ నటులకైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో పాటు యూత్ ఫాలోయింగ్ చాలా ముఖ్యం. కేవలం వారి స్టైల్ తోనే యూత్ ఆ నటులకు ఫ్యాన్స్ అయిపోతుంటారు. అలాంటి కోవకు చెందినవారే అబ్బాస్.  సినీ ఇండస్ట్రీలో అబ్బాస్ కి ఉన్న యూత్ ఫాలోయింగ్ మరొక హీరోకి లేదు. అబ్బాస్ హెయిర్ స్టైల్ ఇప్పటికీ సెలూన్ షాప్ లో చేసే బేసిక్ మోడల్ కటింగ్. ఇక అప్పట్లో అయితే ప్రతి కాలేజీ పిల్లలు తమకు తాము అబ్బాస్ లా  ఫీల్ అయి,తమ చేతులతోనే జుట్టును సవరించుకునేవారు.అంతలా అబ్బాస్ హెయిర్ స్టైల్ కి యూత్ పిచ్చి ఫ్యాన్స్.

అయితే యూత్ లో అంత క్రేజ్ ఉన్న అబ్బాస్  సినిమాల నుండి సడన్గా మాయమయ్యి  హార్పిక్ యాడ్ లోకి ప్రవేశించి, ఫ్యాన్స్ను ఆశ్చర్యపరిచాడు.అంత పెద్ద యూత్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ,సినిమాలో మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. అబ్బాస్ సినీ కెరియర్ లో ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు ఏంటో?ఇప్పుడు తెలుసుకుందాం.

అబ్బాస్ కు సినీ ఇండస్ట్రీలో  ముఖ్యంగా అన్నీ పెద్ద పెద్ద డైరెక్టర్ల తోనే సినిమా అవకాశాలు వచ్చేవి. పెద్దపెద్ద డైరెక్టర్లకు  నో చెప్పలేక, అందులో పాత్ర ఏదైనప్పటికీ వారి కోసం ఓకే చెప్పేవాడు. ఇక అన్ని పాత్రల్లోనూ అబ్బాస్ ను ప్రేక్షకులు ఆదరించలేకపోయారు.

అబ్బాస్ ని చూడగానే బాగా డబ్బున్న అబ్బాయి ఛాయలు కనిపిస్తాయి.  దీంతో అబ్బాస్  మాస్  క్యారెక్టర్లలో  సెట్ కాలేకపోయాడు.

మొదట్లో అబ్బాస్ వాయిస్ ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. కానీ కాలక్రమేణా అబ్బాస్ ఫ్యాన్స్ ఆ వాయిస్ ను యాక్సెప్ట్ చేయలేకపోయారు.

ఇక కామెడీ పరంగా చూస్తే అబ్బాస్ కామెడీ అంతగా పండించేవాడు కాదు.  ఇలా ఎన్నో కారణాల చేత అబ్బాస్  సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు. కానీ ఇప్పటికీ అబ్బాస్ కు  యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.ఇక  ఎప్పటికైనా అబ్బాస్  సినీ ఇండస్ట్రీలోకి వచ్చి, తన సినీ కెరీర్ ని మళ్లీ మొదలు పెట్టాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: