తెలుగు
టెలివిజన్ తెరపై మంచి రేటింగ్స్ తో పాటు మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న షో ల్లో
బిగ్ బాస్ షో కూడా ఒకటి అనే చెప్పాలి. ఇక ఇటీవల ఎంతో ఆసక్తికరంగా కొనసాగిన
బిగ్ బాస్ సీజన్ 4 లో ఫైనల్
విన్నర్ గా అభిజీత్ నిలవగా, రన్నర్ గా
అఖిల్, అలానే మరొక కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ రూ.25 లక్షల నగదు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ యొక్క గ్రాండ్ ఫినాలే కి
మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి షో కి మరింత క్రేజ్ తీసుకువచ్చారు.

అయితే ఫినాలే రోజున సోహెల్ మాట్లాడుతూ, తనకు లభించిన
ప్రైజ్ మనీలో రూ.10 లక్షలు అనాధ శరణాలయానికి ఇవ్వదల్చుకున్నట్లు చెప్పాడు. అయితే అదే సమయంలో ఆ విషయమై
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, సోహెల్ చేస్తున్న ఆ గొప్ప పనిని ఎంతో మెచ్చుకోవడంతో పాటు ఆ రూ.10 లక్షలు తాను ఇస్తానని ప్రకటించారు. అంతేకాక అతడికి ఎంతో ఇష్టం అయిన మటన్ బిర్యానీని కూడా ప్రత్యేకంగా తన భాగస్వామి
సురేఖ తో వండించి తీసుకువచ్చారు మెగాస్టార్. ఆ తరువాత కొన్నాళ్లకు సోహెల్ కు పలు
సినిమా అవకాశాలు కూడా లభించాయి.

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ని ఆయన స్వగృహానికి వెళ్లి కలిసాడు సోహెల్.
మెగాస్టార్ తో పాటు
సురేఖ, అంజనమ్మ సహా మెగా ఫ్యామిలీ మెంబెర్స్ అందరితో కూడా కొద్దిసేపు ఎంతో సరదాగా గడిపిన సోహెల్ వారితో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసాడు. ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు పలు సోషల్
మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున
మెగాస్టార్ తనకు డబ్బులు ఇవ్వడంతో పాటు
మటన్ బిర్యానీ కూడా వండించి తీసుకురావడం నిజంగా తనకు ఇప్పటికీ కూడా ఎంతో షాకింగ్ గా ఉందని, ఇక నేడు ఆయన కుటుంబాన్ని ప్రత్యేకంగా కలవడం ఎంతో ఆనందంగా ఉందని సోహెల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పినట్లు తెలుస్తోంది....!!