ప్రస్తుతం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెన్సేషనల్
మూవీ ఆచార్య.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ,
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో
మెగాస్టార్ కి జోడీగా
కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ
మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు తిరు ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ
సినిమా షూటింగ్ ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

కాగా ఈ
మూవీ తాజా షెడ్యూల్
రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నట్లు సమాచారం. తొలిసారిగా తన
తండ్రి మెగాస్టార్ తో కలిసి మెగాపవర్ స్టార్
రామ్ చరణ్ ఈ మూవీలో నటిస్తున్నారు.
చిరంజీవి పాత్ర తో పాటు చరణ్ పాత్ర కూడా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉంటుందని, రిలీజ్ తరువాత తప్పకుండా ఆయన రోల్ ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ
సినిమా యొక్క మ్యూజిక్ గురించి ఇటీవల ఒక తెలుగు న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో భాగంగా
మణిశర్మ మాట్లాడుతూ, గతంలో
మెగాస్టార్ గారితో ఎన్నో
బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చానని, మళ్ళి చాలా సంవత్సరాల తరువాత ఆయన సినిమాకు పనిచేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని, ఇక దర్శకడు
శివ తనకు ఎటువంటి మ్యూజిక్, సాంగ్స్ కావాలో అడిగి మరీ తీసుకుంటారని, ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందని, తప్పకుండా ఈ
మూవీ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంటుందని
మణిశర్మ అన్నారు. కథ, కథనాల పరంగా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా
కొరటాల తీస్తున్న
సినిమా మంచి
సక్సెస్ సాదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. మొత్తానికి చాలా ఏళ్ళ తరువాత మరొక్కసారి ఆచార్య ద్వారా
మెగాస్టార్ మణిశర్మ ల కాంబినేషన్ లో మంచి మ్యూజికల్ మూవీని చూడవచ్చని అంటున్నారు ప్రేక్షకులు...!!