రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా ఒక్కో సినిమాతో అమాంతం తన క్రేజ్, పాపులారిటీ, మార్కెట్ ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల నటించిన సాహో మూవీ ప్రభాస్ కి మరింతగా పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీ తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, అలానే మరొక యువ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.

కాగా వీటిలో ఆదిపురుష్ ఈ ఏడాది జులై 30న రిలీజ్ కానుండగా మరోవైపు సలార్, ఆదిపురుష్ సినిమాలు వేగంగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ లో ప్రభాస్ ఒక వయొలెంట్ మాస్ యువకుడి పాత్ర చేస్తుండగా, మైథలాజికల్ మూవీ గా రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆదిపురుష్ లో ఆయన రాముడి రోల్ చేస్తున్నారు. టి భూషణ్ కుమార్ ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఆదిపురుష్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడి పాత్ర చేయనున్నారు. 

అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే ముందుగా సలార్ కోసం ఒకింత భారీ గా బాడీ పెంచిన ప్రభాస్, దాని షెడ్యూల్స్ వేగవంతంగా పూర్తి చేసిన అనంతరం ఆదిపురుష్ లో రాముడి పాత్ర కోసం కొంత మేర బరువు తగ్గనున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఈ రెండు సినిమాల తరువాత త్వరలో నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై రూపొందనున్న మూవీలో ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే. ఆ మూవీలో ప్రభాస్ ది స్టైలిష్ గా సాగే పాత్ర కావడంతో అదే విధమైన స్లిమ్ లుక్ ని ఆయన ఈ మూవీలో కూడా కొనసాగించనున్నారట. మొత్తంగా ప్రస్తుతం తన సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్న ప్రభాస్ కి దండం పెట్టినా తక్కువే అంటూ పలువురు ప్రేక్షకాభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: