యువ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మాతగా నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో నటించిన తాజా చిత్రం జాతిరత్నాలు.. ఇటీవలే మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11 న విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.. సినిమా వచ్చి మూడు వారాలు అవుతున్నా కానీ..ఇంకా ఈ సినిమా జోరు తగ్గలేదంటే.. ఈ సినిమాను ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.. కరోనా తర్వాత ఓ చిన్న సినిమాకి ఈ రేంజ్ లో ఆదరణ దక్కడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే..  

కరోనా లాక్‌డౌన్ తర్వాత  కేంద్ర ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్స్ నడుపుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రేక్షకులు కరోనాకు భయపడకుండా ఎంచక్కా థియేటర్స్‌కు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న ప్రేక్షకులు ఎలాంటి భయాలు లేకుండా థియేటర్స్‌కు వస్తున్నారు. ఈ యేడాది జనవరిలో 'క్రాక్'మూవీతో మొదలైన కలెక్షన్ల ప్రభంజనం..ఫిబ్రవరిలో 'ఉప్పెన'తో ఉవ్వెత్తున ఎగిసింది. ఆ తర్వాత మళ్లీ 'జాతి రత్నాలు' సినిమాతో థియేటర్స్ కళ కళ లాడుతున్నాయి.

 అయితే. క్రాక్, ఉప్పెన సినిమాలు సాధించలేని రికార్డును 'జాతి రత్నాలు' సినిమా సాధించింది.ఈ సినిమా తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. కరోనా తర్వాత విడుదలైన 'మాస్టర్', క్రాక్', ఉప్పెన' సినిమాలేవి యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయలేకపోయాయి.కానీ అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన 'జాతి రత్నాలు' సినిమా మాత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్ వసూళ్లను సాధించింది. బాలీవుడ్‌లో రిలీజ్ సినిమాలేని ఈ మధ్యకాలంలో ఈ రేంజ్ వసూళ్లను సాధించలేదంటే మన జాతిరత్నాలు డామినేషన్ విదేశాల్లో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: