
రికార్డుల సంగతి పక్కనపెడితే.. ట్రైలర్ లో కొత్తగా చూపించింది ఏంటి అనేదానిపైనే ఇప్పుడు చర్చంతా. పవన్ కల్యాణ్ కోర్టు సీన్లు, కోర్టులో వచ్చే డైలాగులతోటే ట్రైలర్ ని సరిపెట్టారు. అయితే కోర్టులో న్యాయవాదిగా పవన్ తనదైన మేనరిజంతో నందాజీ అంటూ ప్రకాష్ రాజ్ ని ప్రశ్నించే సీన్ మాత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. పవన్ మేనరిజంని ఇష్టపడేవారికి ఈ ట్రైలర్ పండగే.
ట్రైలతో ఓ అంచనాకి రావొచ్చా..?
వకీల్ సాబ్ సినిమాలో కోర్టు సీన్లు ఎంత ముఖ్యమో.. పవన్ కల్యాణ్ ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ పవన్ మూడ్ ఆఫ్ సీన్స్.. అన్నీ అంతే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అయితే వీటికి ట్రైలర్ లో పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. స్టోరీని ఎక్కువగా రివీల్ చేయకూడదనే ఉద్దేశంతోటే కోర్టు సీన్లతో సరిపెట్టారని అంటున్నారు. కనీసం హీరోయిన్ శృతిహాసన్ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ట్రైలర్ లో ఆమె కనిపించలేదు. సోషల్ మీడియాలో ఓ వర్గం వకీల్ సాబ్ ట్రైలర్ పై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలయ్యేలా కనిపిస్తోంది.
మొత్తమ్మీద వకీల్ సాబ్ ట్రైలర్ అభిమానుల్ని అలరించేలా ఉన్నా.. ఓవరాల్ గా సినిమాపై హైప్ పెంచేందుకు ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. దిల్ రాజు బ్యాచ్ మాత్రం ట్రైలర్ తో సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతాయని అంటోంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. కరోనా తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమాగా, ఓపెనింగ్స్ లో వకీల్ సాబ్ అన్ని రికార్డులు తుడిచిపెడుతుందని అంటున్నారు. పవన్ రీఎంట్రీ స్టామినా ఎంతో ఆరోజు తేలిపోతుంది.