పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ " వకీల్ సాబ్ ". ప్రపంచ వ్యాప్తంగా ఏప్రెల్ 9న విడుదల అయ్యి మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పవర్ స్టార్ ను దాదాపుగా మూడేళ్ళ తరువాత తెరపై చూడడంతో అభిమానుల ఆనందనికి అవధులు లేకుండా పోయాయి.  ఏడాది గ్యాప్ తరువాత విడుదల అయిన పెద్ద హీరో సినిమా కావడంతో అన్నీ చోట్ల కూడా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.  ఇక సినిమాలో పవర్ స్టార్ లాయర్ సత్యదేవ్ పాత్రలో అదరగొట్టాడు. 

పవన్ మార్క్ డైలాగ్స్, ఫైట్స్, ఎమోషన్స్, అన్నీ కూడా సమపాళ్లలో ఉండడంతో సినిమాకు అన్నీ వైపులా నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక "వకీల్ సాబ్ " సినిమా పై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ట్విట్టర్ లో తమదైన రీతిలో స్పందిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి వకీల్ సాబ్ సినిమా పై స్పంధించారు. " వకీల్ సాబ్ జడ్జ్ మెంట్..పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్.. పవన్ సార్ ఒన్ మ్యాన్ షో గా మూవీ ని నడిపించారు..డైరెక్టర్ వేణు శ్రీరామ్ టేకింగ్ చాలా బాగుంది..సినిమా ఘన విజయం సాధించినందుకు చిత్రబృందానికి శుభాకాంక్షలు " అంటూ అనిల్ ట్వీట్ చేశారు.

 ఇక వకీల్ సాబ్ మొదటి రోజే అదిరిపోయే టాక్ సొంతం చేసుకోవడంతో ఇక అందరి దృష్టి మొదటి రోజు కలెక్షన్లపై పడింది. పవన్ సాధారణంగా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నా సినిమాలతోనే మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబడుతూ ఉంటాడు. ఇక సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే కలెక్షన్ల ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మొదటి రోజు కలెక్షన్లలో పవన్ " వకీల్ సాబ్ " తో సరికొత్త రికార్డులు సెట్ చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: