కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా విజయ్ నటిస్తున్న అన్ని సినిమాలు తెలుగులో డబ్ కాబడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేటర్లలో విడుదలవుతున్నాయి. విజయ్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో హిట్స్ కూడా అయ్యాయి. అయితే తెలుగు ప్రేక్షకులు తన సినిమాలను ఆదరిస్తున్నారని విజయ్ స్ట్రెయిట్ గా ఒక టాలీవుడ్ మూవీ చేయడానికి సిద్ధమయ్యారు.


అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీపైడిపల్లి దర్శకత్వంలో రానున్న ఓ సినిమాకి విజయ్ సైన్ చేశారట. నిజానికి వంశీ పైడిపల్లి తో కలసి సినిమా చేసేందుకు ఏ హీరో కూడా ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు సంవత్సరాల పాటు వంశీ పైడిపల్లి ఖాళీగానే ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా చెన్నై వెళ్లిన వంశీ.. దళపతి విజయ్ ని కలిసి తన వద్ద ఉన్న సినిమా స్టోరీని వినిపించారు. అయితే వంశీ నారేట్ చేసిన విధానం నచ్చడంతో పాటు కథ కూడా బాగా నచ్చడంతో విజయ్ సేతుపతి అతనితో కలిసి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో స్క్రిప్ రెడీ చేసే పనిలో వంశీ పైడిపల్లి నిమగ్నమయ్యారు.



అయితే ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మించనున్నారని సమాచారం. ఇకపోతే విజయ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం జూన్ నుండి ప్రారంభం కానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు. విజయ్ దళపతి కెరియర్ లో 65వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.



మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ తో మరో సినిమా చేసేందుకు కూడా విజయ్ సంతకం చేసారు. దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లు పూర్తయ్యాక విజయ్ వంశీ పైడిపల్లితో కలిసి తన తొలి తెలుగు సినిమా చేస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: