ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా మన దేశం ఎన్నో ఇబ్బందులను ఎదురుకొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో రోజుకు వేలాదిగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా వణుకుతోంది. అందుకే పలువురు ఆరోగ్య నిపుణులు అధికారులు ఎక్కడికక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలానే పక్కాగా చేతులు శానిటైజ్ చేసుకుని, సామజిక దూరం పాటించడంతో పాటు పూర్తిగా ఇళ్లకే పరిమితం అవ్వండి అంటూ కోరుతున్నారు. ఇక ఈ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ ని అమలు చేస్తున్నాయి.

ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ కూడా భారీ గా పాజిటివ్ కేసు లు నమోదు అవుతుండడంతో అనేక రంగాలు సైతం సమస్యల్లో పడ్డాయి. మరోవైపు పలు సినిమాల షూటింగ్స్ నిలుపుదల చేయడంతో పాటు సినిమా హాల్స్ సహా జిమ్ లు, పార్క్ లు, స్టేడియం లు వంటివి పూర్తిగా మూతబడ్డాయి. ఇక ఎక్కడికక్కడ పలువురు సినిమా నటులు తమ ఫ్యామిలీ లతో కలిసి ఇంట్లోనే ఉండి సమయాన్ని గడుపుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే, ఈ కరోనా మహమ్మారిని మన దేశము నుండి తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించి, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, సామజిక దూరం పాటించడంతో పాటు ముఖ్యంగా వ్యాక్సినేషన్ పై అపోహలు మాని తప్పకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతూ ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కొద్దిసేపటి క్రితం ఒక వీడియో ని విడుదల చేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ వీడియోలో హీరోలు చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, హీరోయిన్ అలియా భట్, అలానే దర్శకుడు రాజమౌళి కనిపిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: