1970 ప్రాంతాలలో  తెలుగు నవలా సాహిత్యాన్ని మకుటంలేని మహారాణి గా ఏలిన ఖ్యాతి యద్దనపూడి సులోచనారాణి  సొంతం. అప్పట్లో ఆమె రచనా శైలి ఒక ట్రెండ్. ఆ రోజులలో ఆమె నవలలు ఎన్నో సినిమాలుగా వచ్చాయి. అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లు ఆమె నవలా చిత్రాలలో నటించారు.  



మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎద్దనపూడికి వీరాభిమాని.  ఆ వీరాభిమానంతో ఆయన ఎన్నాళ్ల నుంచో  దాచుకున్న టైటిల్ ఒకటి ఉందట.  ఆ టైటిల్ తో సినిమా తీయాలని త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేయించుకుంటూ వచ్చాడని అంటారు. ఆ అభిమానంతోనే ‘అతడు’ సినిమాలో మహేష్ పాత్ర పేరుకు పార్ధు అన్న పేరు పెట్టడం జరిగింది అంటారు.   



అంతేకాదు యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన నవలలో ‘పార్ధు’ ఒకటి. ఆ నవల త్రివిక్రమ్ చదివిన నాటి నుండి ఆనవల అంటే త్రివిక్రమ్ కు చాలఇష్టం. ఆ అభిమానంతోనే ఎప్పటికైనా ‘పార్ధు’ టైటిల్ తో సినిమా తీయాలని త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉంటూ కొన్ని సంవత్సరాల క్రితమే ఆ టైటిల్ ను రిజిస్టర్ చేసి ఎప్పటికైనా సినిమా తీయాలని భావించాడు అన్నవార్తలు ఉన్నాయి.  



ఆ మధ్య ఏషియన్ ధియేటర్స్ సునీల్ తాను నాగశౌర్యతో తీసే ‘లక్ష్యం’ సినిమా కోసం ఇదే టైటిల్ ను అనుకున్నారు. కానీ ఆ టైటిల్ ను ఇవ్వడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పుకోలేదు అని అంటారు. ఆమధ్య మరొక నిర్మాణ సంస్థ ఈ టైటిల్ విషయమై త్రివిక్రమ్ ను సంప్రదించి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా త్రివిక్రమ్ సున్నితంగా తిరస్కరించాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. ఇప్పుడు ఈ టైటిల్ తో మహేష్ తో చేయబోతున్న ఈ సినిమాలో మహేష్ పక్కన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేయడానికి ఆమెతో రాయబారాలు చేస్తున్నప్పటికీ ఆమె 4 కోట్ల పారితోషికం డిమాండ్ త్రివిక్రమ్ ను ఆలోచనలలో పడేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: