పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు విరామం దొరకడంతో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల దాదాపు 3 సంవత్సరాల తరువాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి పెద్ద ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించింది. ఇక పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమాతో పాటు వరుసగా సినిమాలు ప్రకటించేశారు. అయితే కరోనా వచ్చి అంతా మార్చేసింది. దేశంలో తొలి విడత కరోనా వచ్చినప్పుడు అన్ని సినిమాలతోపాటు పవన్‌ సినిమాల చిత్రీకరణలు ఆగిపోయాయి.తీరా మళ్లీ మొదలయ్యాయి అనుకుని ఆనందపడుతుండగా సెకండ్‌ వేవ్‌ వచ్చి మళ్లీ ఆగిపోయాయి.

ఇక ఈ మధ్యే పవన్‌కు కరోనా సోకడంతో కొన్నాళ్లు సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి.దీంతో మొత్తం ప్లానింగ్‌ మారింది అంటున్నారు. ప్రస్తుతం పవన్‌ చేతిలో 'అయ్యప్పనుమ్‌ కొషియమ్‌' రీమేక్‌, 'హరి హర వీరమల్లు' ఉన్నాయి. ఇవి కాకుండా హరీశ్‌ శంకర్‌ - మైత్రీ మూవీ మేకర్స్‌, సురేందర్‌ రెడ్డి - రామ్‌ తాళ్లూరి సినిమాలున్నాయి. లెక్క ప్రకారం చూస్తే… తొలుత 'అయ్యప్పనుమ్‌ కొషియమ్‌' రీమేక్‌ రావాలి.ఆ తర్వాత 'హరి హర వీరమల్లు' రావాలి. ఆ తర్వాత మిగిలినవి. నిర్మాతలు కూడా ఇదే ప్రకటించారు.

అయితే ఇప్పుడు ప్లాన్‌ మారిందట. 'హరి హర వీరమల్లు' బదులు హరీశ్‌ శంకర్‌ సినిమా లైన్‌లోకి తెస్తున్నారట. దానికి తగ్గట్టే పవన్‌ డేట్స్ అడ్జెస్ట్‌ చేస్తున్నారట 'అయ్యప్పనుమ్‌ కొషియమ్‌' రీమేక్‌ పనులు చివరిదశకొచ్చాయట. కాబట్టి దానిని ముందు ఫినిష్‌ చేసి, ఆ తర్వాత హరీశ్‌ శంకర్‌ సినిమా మొదలుపెడతారట. అంటే సంక్రాంతికి "హరి హర వీరమల్లు" బదులు హరీశ్‌ శంకర్‌ సినిమా రాబోతుందని సమాచారం. ఇక ఫ్యాన్స్ కూడా మొదట హరీష్ శంకర్ సినిమా వస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారట.ఎందుకంటే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ అలాంటి హిట్ ని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: