కొన్ని కొన్ని సార్లు జబర్దస్త్ లోని కమెడియన్స్ తీసుకునే కాన్సెప్టులు పాతవే అయినప్పటికీ వాటిని కొత్తగా ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ ఉంటారూ. అదే సమయంలో అటు జబర్దస్త్ ఎపిసోడ్ ఎంతగానో ఆసక్తిని పెంచేందుకు మొత్తం ఎపిసోడ్ లోని కీలక పంచులు మొత్తం ఇక ప్రోమోలో చూపిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల విడుదలైన జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇక ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే రాకెట్ రాఘవ ఇక ఈ సారి పెళ్ళాం ఊరెళితే అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
అయితే పెళ్ళాం ఊరెళితే అనే కాన్సెప్ట్ పాతదే అయినప్పటికీ ఎప్పుడు ప్రేక్షకులకు మాత్రం కొత్తగా అని అనిపిస్తూ ఉంటుంది. భర్తతో కలిసి ఉండే భార్య పుట్టింటికి వెళ్ళింది అంటే భర్త ఇంట్లో స్నేహితులతో ఎంతగా ఎంజాయ్ చేస్తాడు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఇదే కాన్సెప్ట్ ని తీసుకున్నాడు రాకెట్ రాఘవ. ఈ క్రమంలోనే రాకెట్ రాఘవ స్కిట్ చేస్తున్న సమయంలో అనసూయ భర్త పై రోజా చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. పెళ్ళాం ఊరెళితే వారం రోజులు ఇంట్లో పండుగ అంటూ రాకెట్ రాఘవ అనగానే ఈ స్కిట్ మా ఆయన చూడకుండా చేయాలి అంటుంది అనసూయ.. ఇక వెంటనే అందుకున్న రోజా నువ్వు షూటింగ్ కి వచ్చినప్పుడు మీ ఆయన కూడా అదే చేస్తుంటాడు అంటూ కామెంట్ చేయడం తో ఇక నోరెళ్ళ పెడుతుంది అనసూయ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి