తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పోలీస్ కథలతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి. వాటిల్లో నందమూరి హరికృష్ణ నటించిన 'సీతయ్య' సినిమా కూడా ఒకటి.ఎవరి మాట వినడు అనేది ట్యాగ్ లైన్. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా హరికృష్ణ కి ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.ఒకప్పటి హిట్ చిత్రాల దర్శకుడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమాలో హరికృష్ణ సరసన సౌందర్య, సిమ్రాన్ కథానాయికలుగా నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్. ఎమ్. కీరవాణి స్వరపరిచిన ఈ సినిమా పాటలు అప్పట్లో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


2003 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఆంధ్రా లోని పలు థియేటర్లలో విజయవంతంగా వంద రోజులు కూడా పూర్తి చేసుకొని రికార్డులు క్రియేట్ చేసింది.సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన నట విశ్వరూపాన్ని చూపించాడు.ఖాకీ డ్రెస్ లో చిటికేస్తూ హరికృష్ణ పలికే డైలాగులు సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచాయి.రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పోలీస్ పాత్రతో పాటుగా శివయ్య అనే మరో పాత్ర లో కూడా మెప్పించాడు హరికృష్ణ.

ఇక 2003 లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇక దర్శకుడు వైవిఎస్ చౌదరిసినిమా కంటే ముందు హరికృష్ణ తో లాహిరి లాహిరి లాహిరి లో అనే మంచి ఫ్యామిలీ మూవీ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక హరికృష్ణ హీరోగా నటించిన సినిమాలు తక్కువే అయినా.. ఇండ్రస్టీ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుక్ఉన్నారు. ఆయన కేవలం 13 సినిమాలు మాత్రమే చేసాడు.అందులో 'సీతయ్య' సినిమా నటుడుగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.ఇక ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిన ఆయన.. దురదృష్టవశాత్తు 2018 లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు.ప్రస్తుతం తన తండ్రి సినీ ప్రస్థానాన్ని  కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కొనసాగిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: