ఇస్మార్ట్ శంకర్ తో తన కెరీర్ ని తిరిగే గాడిలోకి పెట్టుకున్న రామ్ పోతినేని రెడ్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకొని తను సక్సెస్ ట్రాక్ లో ఉన్నట్లు చెప్పాడు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, చాలా కథలు విని తమిళంలో మాస్ చిత్రాల దర్శకుడిగా పేరున్న లింగస్వామి కథను ఓకే చేశాడు రామ్. పందెంకోడి చిత్రంతో తెలుగు లో కూడా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు లింగుస్వామి. ఆ మధ్య అల్లు అర్జున్ తో ద్వి భాషా సినిమాకి ప్రయత్నాలు చేయగా అది మధ్యలోనే ఆగిపోయింది. కారణమేంటో తెలియదు కానీ ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ లింగుస్వామి లు మళ్లీ కలవలేదు..

మళ్లీ తమిళ్ లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు రామ్ తో డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు లింగస్వామి. రామ్ ని గతంలో ఏ దర్శకుడు చూపించని విధంగా పవర్ ఫీల్ కాప్ గా ఈ సినిమాలో లింగుస్వామి చూపించబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ మసాలా సినిమాలను ఫ్యాన్స్ కి నచ్చేలా తెరకెక్కించడంలో లింగస్వామి స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఆయన గత సినిమాలు చూసి చెప్పొచ్చు. రామ్ ఇలాంటి సినిమాల్లో నటించిన కూడా ఎలివేషన్ ఎక్కువగా లేకపోవడంతో క్లాస్ హీరో గానే మిగిలిపోయాడు. ఇప్పుడు వీరి కలయిక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం లింగుస్వామి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా టాక్ వినిపిస్తుంది. హీరో రామ్ పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండగా లింగుస్వామి అందులో 25% రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్ర చేస్తుండగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో డే వన్ మీడియం రేంజ్ మూవీస్ ఓపెనింగ్స్ రికార్డును బ్రేక్ చేయగా, రెడ్ తో 50% లిమిటేషన్ వలన ఆ రికార్డ్ మిస్ అయిన ఈ సినిమా కొత్త బెంచ్ మార్క్ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.......

మరింత సమాచారం తెలుసుకోండి: