కరోనా సెకండ్ వేవ్ ఇంకా మరిచిపోక ముందే ధర్డ్ వేవ్ కూడా రాబోతోంది అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి కంటే అది ఇంకా భయంకరంగా ఉంటుందని చాలా మంది ఇది ముందే భయపెట్టేస్తున్నారు.. మరీ ముఖ్యంగా పరచూరి మల్లిక్ అనే ఒక కెమికల్ ఇంజనీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాక మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నాయి.. ఆయన కామెంట్స్ మీద సీరియస్ అయిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు అండగా నిలబడుతూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తెలంగాణ డాక్టర్ జి.శ్రీనివాసరావును ఉద్దేశిస్తూ వర్మ ఏకంగా 10 ట్వీట్ల దాకా చేశారు. శ్రీనివాస రావు గారు మీరు తెలంగాణ పబ్లిక్ హెల్త్ అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ కి హెడ్ గా ఉన్న నేపథ్యంలో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయని వాటిని తీర్చాలని కోరుతూ వర్మ మొదలుపెట్టారు. పరుచూరి మల్లిక్ చేసిన వ్యాఖ్యల మీద మీరు కేసులు ఎలా పెడతారు ? ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత ఆయన మాటలు నిజం అవ్వకపోతే కదా కేసులు పెట్టాల్సింది అని వర్మ ప్రశ్నించారు.  ఆయన క్వాలిఫికేషన్ ఏమిటి అని ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అనే విషయాలు నాకు తెలియదు కానీ చాలామంది ఆయన చెబుతున్న విషయాలనే నమ్ముతున్నారు మీరు ఎక్స్ పర్ట్స్ అని చెప్పిన వారి కంటే ఆయన చెబుతున్న విషయాలు నమ్మదగిన విధంగా ఉన్నాయి. 


అసలు ఆయన వీడియోలు కనీసం మీరు చూశారా అని ప్రశ్నించారు. అలాగే నరేంద్ర మోడీ మొదలు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న దాదాపు అందరి మీద కేసులు పెట్టాలని ఎందుకంటే 2021 ఫిబ్రవర లో కరోనా అంతం అయిపోయిందని వారు స్టేట్మెంట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఒకవేళ మల్లిక్ చేస్తున్నవన్నీ ముందుస్తు ఆరోపణలు అయితే ఆయన మీద ఏ లెక్కన కేసులు పెట్టారు ? కుంభమేళాలు, ర్యాలీలు నిర్వహించి అనేక మందిని చంపిన వారి మీద ఎలాంటి కేసులు పెట్టాలని అని ప్రశ్నించారు. అలాగే మీ చిన్నప్పుడు మీ తల్లి కూడా చెప్పే ఉంటుంది కదా చనిపోవడం అంటే జాగ్రత్తగా ఉండటం మేలు అని, అలాంటప్పుడు మల్లిక్ చెప్పిన దానికి మీ తల్లి చెప్పిన దానికి ఏమి తేడా ఉంది అని వర్మ ప్రశ్నించారు.


 ఇక అసెంబ్లీలో కరోనా రాదు అని ప్రకటించిన కేసీఆర్, వస్తే పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో చంపేయవచ్చని చెప్పిన జగన్ మీద మీరు ఎలాంటి కేసులు పెట్టగలరు అని ప్రశ్నించారు. మీరు ఒకసారి ఆయన చెప్పిన మాటలను సగం సీరియస్ గా తీసుకుని ఆయన అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, మీరు లేదా మీరు భావిస్తున్న సో కాల్డ్ ఎక్స్ పర్ట్లు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. మరి దీనికి అటుపక్క నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv