పితృ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క సెలబ్రిటీ తమ కొడుకులతోనూ, తమ తండ్రుల తోనూ కలిసి దిగిన  ఫోటోలను ట్విట్టర్, ఫేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ వారికి తమపై ఉన్న ప్రేమానురాగాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే అందులో భాగంగానే నాగబాబు కూడా తన కొడుకుతో ఉన్న ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది..

వరుణ్ తేజ్ చిన్నగా ఉన్నప్పుడు తనను ఎత్తుకొని, నీవు ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలి రా కన్నా..!అంటూ దిగిన ఒక ఫోటోని ట్విట్టర్ ద్వారా  షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలో చూస్తే నాగబాబు అచ్చం చిరంజీవి గారి లాగే వున్నారు. వరుణ్ తేజ్ ఇందులో చాలా చక్కగా ముద్దుగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నాగబాబు షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా  మారింది.

ఇక నాగబాబు అసలు పేరు కొణిదెల నాగేంద్రబాబు. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. అంతేకాదు తన అన్నయ్య నటించిన పలు చిత్రాల్లో కూడా నటించి అందరిని మెప్పించాడు. మంచి నటుడిగా, విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. అంతే కాకుండా బుల్లితెరపై కూడా జెమినీలో ప్రసారం అయిన అపరంజి సీరియల్, ఈటీవీలో ప్రసారమైన షికారామ్, మా టీవీలో ప్రసారమైన సీతామాలక్ష్మి, జీ ఫైవ్ లో ప్రసారమైన నాన్న కూచి వంటి ధారావాహికలో కూడా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక అంతే కాకుండా ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో జడ్జిగా కూడా మొన్నటి వరకు వ్యవహరించాడు  ఆ తర్వాత జీ తెలుగులో అదిరింది ప్రోగ్రాం లో కూడా జడ్జిగా వ్యవహరించారు. ఇక ప్రస్తుతం ఈ షో నిలిపివేయబడిన విషయం తెలిసిందే.ఇక  నాగబాబు రాజకీయాల్లో కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: