ఫాదర్స్​ డే సందర్బంగా చాలా మంది తమ నాన్నలకు విషెష్​ చెబుతున్నారు. అలాగే ఈ ఫాదర్స్​ డే రోజు ఎస్పీ చరణ్​, తన తండ్రి బాల సుబ్రహ్మణ్యాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఫాదర్స్​ డే సందర్భంగా ఓ దినపత్రిక ఆయన ఇంటర్వూ ఇచ్చారు. ‘నాన్నకు మరణం లేదు’ అనే శీర్షికతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు ఎస్పీ చరణ్​.


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే తెలుగు పాటల ప్రేమికుడికి పరిచయం చేయనవసరం లేని పేరు. పాటల మాంత్రికుడిగా, గాన గంధర్వుడిగా పేరు తెచ్చుకున్నారు. అన్ని రకాల పాటలు పాడటంలో ఆయనకు ఆయనే సాటి. దాదాపు అన్ని భాషాల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు ఉన్నాయంటే ఆ గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ కరోనా మహమ్మారి గొప్ప సంగీత విద్వాంసుడిని పాటల ప్రేమికులకు దూరం చేసింది. “ప్రతీ పాటలో నాన్న ఉన్నారు.



అభిమానుల గుండెల్లో నాన్న ఉన్నారు. పాట ఉన్నంత కాలం నాన్న ఉంటారు. ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్టం’ అంటూ నాన్న గురించి ఆ పత్రికలో చెప్పుకొచ్చాడు ఎస్పీ చరణ్. నాన్న ఎప్పుడూ బిజీగా ఉండేవారని, దాంతో ఎక్కువ చనువు ఉండేది కాదని, కానీ ఎప్పుడు కాళీ దొరికినా తమతో సమయం గడిపేవారని గుర్తు చేసుకున్నారు చరణ్. ఇప్పుడు తమ కుటుంబం పునాదిని కోల్పొయిందని, ఆయన లేని లోటు ఇప్పిడిప్పుడే తెలుస్తోందని ఆ పత్రికలో భావోద్వేగానికి గురయ్యారు ఎస్పీ చరణ్.



50 ఏళ్లలో ఎస్పీ బాలు పాడిన ఆణిముత్యాల్లాంటి పాటలను మళ్లీ నేటి తరానికి పరిచయం చేయాలని ఉందని తన మనసులోని ఆలోచను పంచుకున్నారు ఎస్పీ చరణ్. తను ఎప్పుడూ గాయకుడిని అవుదామనకులేదని, తను పాడిన నాలుగైదు పాటలతోనే ‘పాటలు పాడటం నేర్చుకో నాన్న’ అని ఎస్పీ బాలు చెప్పారని గుర్తుచేసుకున్నాడు ఎస్పీ చరణ్. ఇలా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఈ ఫాదర్స్ డే రోజు మళ్లీ తెలుగు పాటల ప్రేమికుల ముందుకు తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: