టాలీవుడ్ లో హీరోయిన్ అంటే గతంలో ముంబై వైపు చూసే వారు. అక్కడి ముద్దుగుమ్మలు టాలీవుడ్ కి వచ్చి తమ అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే వారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు దర్శక నిర్మాతలు హీరోయిన్ల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ విధంగా మలయాళ ముద్దుగుమ్మ లపై వారి కన్నుపడింది. వరుసగా మలయాళ ముద్దుగుమ్మలను తీసుకువస్తూ తమ సినిమాలను హిట్ చేసుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లు గా ఉన్న మలయాళీ ముద్దుగుమ్మ లను చూద్దాం.

నేను శైలజ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళం అమ్మాయి కీర్తి సురేష్. ఇప్పుడు ఆమె తెలుగు లో స్టార్ హీరోయిన్ గా ఉంది. మహేష్ సరసన సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తోంది. నితిన్ హీరోగా నటించిన త్రివిక్రమ్ దర్శకత్వంలో ని 'అ ఆ' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు వరుస తెలుగు సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. ఈమె కూడా మలయాళీ ముద్దుగుమ్మే. తన అందంతో టాలీవుడ్ ని మైమరిపింప చేస్తున్న మరొక మలయాళీ హీరోయిన్ నివేద థామస్. నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ చిత్రంతో ఈమె హీరోయిన్ గా పరిచయమై ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోలతో నటించింది.

నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో హీరోయిన్ గా చేసిన మంజిమా మోహన్ కోలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్. అలాగే నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన మడోనా సెబాస్టియన్ కూడా కేరళ నుంచి వచ్చిన అమ్మాయి. కేరళ కుట్టి నమిత ప్రమోద్ ఆది చుట్టాలబ్బాయి సినిమాతో పరిచయం అయ్యి నారా రోహిత్ కథలో రాజకుమారి సినిమాలో మెరిసింది. అను ఇమాన్యుయెల్, మియా జార్జ్ వంటి హీరోయిన్ లు మలయాళం నుంచి వచ్చి టాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: