సినిమా ఇండస్ట్రీలో పారితోషకాలు అనేది కీలక పాత్రను పోషిస్తుంటాయి వారికి ఉన్న క్రేజ్ ను బట్టి డిమాండ్ ను బట్టి పారితోషకం డిసైడ్ అవుతూ ఉంటుంది సదరు నటీనటులకు సాంకేతిక నిపుణులకు. అయితే మొదట్లో తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వారు ఆ తరువాత క్రేజ్ పెరిగిన కొద్దీ పారితోషకాన్ని పెంచేస్తూ ఉంటారు. ముఖ్యంగా తక్కువ టైం కెరియర్ ఉండే హీరోయిన్ లు సినిమా సినిమాకి తన పారితోషకాన్ని మార్పులు చేస్తూ ఉంటారు. టాప్ హీరోయిన్ లకు కోటికి పైగానే రెమ్యునరేషన్ ఉండడం విశేషం.

ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ లలో ఎక్కువ శాతం మంది ప్రస్తుతం ఒక్కో సినిమాకి 3 నుండి 10 కోట్లు అంతకుమించి తీసుకునే వారు కూడా ఉన్నారు. సినిమా రేంజ్ ను బట్టి, వారి కాల్షీట్ల ను బట్టి పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో అత్యధిక పారితోషిక తీసుకుంటున్న హీరోయిన్ లు ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనే ఆలియా భట్ ఇలా కొందరు ఉన్నారు. వీరు సినిమా కు తీసుకునే రెమ్యునరేషన్ సౌత్ హీరోల పారితోషకాల కు మించి ఉంటుందని టాక్. అలాంటి వీరు తొలిరోజుల్లో ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

ప్రియాంక చోప్రా మొదటి సంపాదన ₹5000. తన మొదటి సంపాదన ప్రియాంక చోప్రా ఆ సమయంలో తల్లికి ఇచ్చిందట. అప్పట్లో 5000 అంటే చాలా పెద్ద మొత్తమే. ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్టులను కూడా చేస్తూ వందల కోట్లు సంపాదిస్తుంది. ఆలియా భట్ మొదటి నుంచి ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఆమె మొదటి సంపాదన తన అవసరాలకు వినియోగించుకుందట.. సోనం కపూర్ ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయగా దానికి ఆమెకు శాలరీ రాగా దాంతో తన ఖర్చులను చూసుకుందట. కంగనా రనౌత్ తన మొదటి సంపాదన తో బట్టలు కొనగా,  రిచా చద్దా తనకు వచ్చిన 200 రూపాయల తొలి పారితోషకాన్ని తండ్రి చేతిలో పెట్టిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: