
తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ "ఆర్ఆర్ఆర్" చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న చరణ్ ఇటీవల రంగస్థలం సినిమా తో టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టారు. 2018 సినిమా సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా రంగస్థలం నిలిచింది. "ఆర్ఆర్ఆర్" చిత్రంతో ఆయన మరొక ఇండస్ట్రీ హిట్ కొట్టినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు రాజమౌళి 350 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ బిజినెస్ 900 కోట్లు కలెక్ట్ చేసిందట. ఈ లెక్కన చూసుకుంటే.. రిలీజ్ కాకముందే "ఆర్ఆర్ఆర్" సినిమా బాహుబలి పార్ట్ 2 ఆల్ టైమ్ కలెక్షన్లలో సగానికి పైగా వసూలు చేసింది అని చెప్పుకోవచ్చు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకి సంబంధించి కేవలం రెండు సాంగ్స్ మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. మిగతా షూటింగ్ అంతా కూడా పూర్తయిందని మూవీ యూనిట్ ఇటీవలే వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే చెర్రీ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ హల్చల్ చేస్తోంది.
అదేంటంటే, రామ్ చరణ్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన ఇంటిని నిర్మించుకుంటున్నారట. అయితే ఈ ఇంటి కోసం ఆయన సుమారు రూ. 38 కోట్లు ఖర్చు పెడుతున్నారని సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి చెర్రీ ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తున్నారు. కానీ ఇకపై ఆయన తన సతీమణి ఉపాసనతో కలిసి కొత్త ఇంట్లో నివసించబోతున్నారట. కొంతకాలం క్రితం చిరంజీవి తన కోసం ప్రత్యేకంగా ఒక నూతన గృహాన్ని కట్టించుకున్నారు. ఇప్పుడు చెర్రీ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ తన కోసం ఇంద్రభవనం లాంటి ఒక పర్మినెంట్ హౌజ్ ఏర్పరచుకుంటున్నారట.