టాలీవుడ్ మాటల మాంత్రికుడు ప్రస్తుతం మహేష్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేయగా అది వర్కవుట్ అవ్వలేదు. కొన్ని ఈ కారణాల వల్ల ఈ సినిమా క్యాన్సిల్ కావడంతో మహేష్ బాబు తో సినిమా చేయడానికి పూనుకున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా వంటి సినిమాలు రాగా అవి వెండితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. కానీ బుల్లితెరపై సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవి. ఈసారి వెండితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా సినిమా తీస్తారట త్రివిక్రమ్.

గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ సినిమాలు చూస్తుంటే వరుస సూపర్ హిట్ సాధిస్తూ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు.  కథల విషయంలో డైలాగ్స్ విషయంలో పంచులు విషయంలో ఎంతో కేర్ తీసుకునే త్రివిక్రమ్ మహేష్ కి కూడా అదే రేంజ్ కి తగ్గ కథ ఎంచుకున్నాడట. ఇకపోతే త్రివిక్రమ్ చాలా రోజుల నుంచి ఒక సెంటిమెంట్ ఫాలో అవుతుండటం మనం చూస్తున్నాం. అదే హీరోయిన్ విషయం. ఆయన తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కొద్దీ మంది హీరోయిన్ల తోనే పనిచేశాడు. ఒక హీరోయిన్ తో వరసగా రెండు మూడు సినిమాలు చేయడం త్రివిక్రమ్ సెంటిమెంట్. 

ఆ విధంగా ఇలియానా, సమంత, పూజా హెగ్డే వంటి హీరోయిన్ లతో మూడు నాలుగేసి సినిమాలు చేశాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తో సినిమాకి కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకుంటారు అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా నయనతార పేరు మహేష్ బాబు సినిమాకి వినబడుతోంది. మహేష్ విషయంలో త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ను ఎందుకు పక్కన పెట్టినట్లు అని అందరూ ఆలోచిస్తున్నారు. అసలే నయనతార తెలుగు సినిమాలు చేయడంలో కొంత జాప్యం వహిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ సరసన ఈ లేడీ సూపర్ స్టార్ ఏవిధంగా ఇమడ గలుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: