అలనాటి హీరోయిన్ కుష్బూ తమిళ కన్నడ మలయాళ తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేసి సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన మరిన్ని సినిమాల్లో చేస్తోందని ఆమె అభిమానులు ఆశపడ్డ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు అన్నది అసలు నిజం. భవిష్యత్తులో ఆమెకు మరిన్ని పాత్రలు వస్తాయేమో చూడాలి. మరోవైపు షోలలో యాంకర్ గా చేస్తూ ఖుష్బూ తన కెరీర్ ను కంటిన్యూ చేస్తోంది. ఒక సాధారణ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ తర్వాత కాలంలో లో ప్రజలు గుడి కట్టి ఆరాధించే స్థాయికి నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం ఆషామాషీ విషయం కాదు.

కలియుగ పాండవులు సినిమా తో వెంకటేష్ తో పాటు హీరోయిన్ గా ఖుష్బూ పరిచయం అవగా ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటన తో తన అందచందాలతో ప్రేక్షకులను మైమరపించి వారికి చేరువై ఆరాధ్య దేవత గా మారారు. ఆమె అందానికి ఫిదా అయినా తమిళ ప్రేక్షకులు ఆమెకు గుడి కట్టించారు. దర్శకులు సుందర్ ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు కుమార్తెలు. అయితే చిన్నతనంలో తను చాలా బాధలు అనుభవించానని తండ్రి చేతుల్లో చాలా హింసను ఎదుర్కొన్నానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దక్షిణాదిన సంచలనం అవుతుంది.

తల్లిని ఇష్టం వచ్చినట్లు చావ కొట్టేవాడని, మమ్మల్ని కూడా వేధించేవాడని అందుకే ఆమెకు తండ్రి అంటే అసహ్యం, ద్వేషం అని చెప్పింది. తండ్రి పేరును తలచుకోవడానికి కూడా ఇష్టపడను. 35 ఏళ్ల కిందట తన తండ్రి చూసింది ఆఖరి సారి అని  ఆమె చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. బాలనటిగా తన సినిమా కెరీర్ ని ప్రారంభించిన ఈమె అసలు పేరు నఖత్ ఖాన్. ఈ సినిమా సెట్స్ మీద కాస్త ఖుష్బూ గా మారిపోయింది. సినిమాల్లోకి వచ్చాక ఆమె తల్లి తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చిందని. ఆమె తెచ్చేడబ్బు తండ్రికి ఎంతో ఆనందాన్ని చేస్తుందని ఆమె చెప్పారు. ఆయన చేతుల్లో తల్లి నేను నానా నరకం అనుభవించాము అని వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: