వెంకటేష్ హీరోగా నటించిన అసురన్ రీమేక్ "నారప్ప" అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జులై 20 తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాకుండా ఓటీటీ వేదికగా విడుదల అవుతుండటంతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, సంగీత దర్శకుడు మణిశర్మ తీవ్ర నిరాశలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమాతో భారీ డిజాస్టర్ ఫేస్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన వెంకటేష్ తో కలిసి నారప్ప సినిమాని రూపొందించారు కానీ అది థియేటర్లో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతోంది. దీంతో నారప్ప హిట్టా పట్టా అనే విషయం గురించి ఎవరూ పట్టించుకోరు. "నారప్ప" లాంటి మాస్ యాక్షన్ సినిమా ఓటీటీలో విడుదల కావడం వల్ల శ్రీకాంత్ అడ్డాల కెరీర్ కి ఎటువంటి ప్రయోజనం చేయకూరదని చెప్పుకోవచ్చు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైయితే.. బహుశా శ్రీకాంత్ అడ్డాల కి మంచి క్రెడిట్ దక్కేదేమో. కానీ ఇప్పుడు ఆ చాన్స్ లేదని చెప్పుకోవచ్చు.



ఇక మణిశర్మ కూడా నారప్ప సినిమా విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఫిల్మ్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన సమయంలోనే మణిశర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత సంగీతం యూస్ చేయకుండా అసురన్ కోసం జీవీ. ప్రకాష్ స్వరపరిచిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వాడుకున్నారని.. తనకు తెలియకుండానే ఇలా చేశారని మణిశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అసురన్ సినిమాకి సంబంధించిన ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ ని వినియోగించుకొని.. రీ-రికార్డింగ్ ఫినిష్ చేశారని మణిశర్మ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అయితే ఆయన ఈ సినిమాకోసం పాటలను కంపోజ్ చేశారు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అందించలేదని తెలుస్తోంది. ఈ విధంగా నారప్ప సినిమా విషయంలో శ్రీకాంత్ అడ్డాల, మణి శర్మ తీవ్ర నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది.



ఇక నారప్ప రిలీజ్ విషయంలో వెంకటేష్ అభిమానులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వెంకటేష్ ఒక మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారని అభిమానులు సంబర పడ్డారు కానీ వారి ఆనందం ఎంతోకాలం నిలవలేదు. థియేటర్లలో రిలీజ్ చేయాలని నిరాహార దీక్ష కూడా చేశారు కానీ నారప్ప  ఓటీటీ లోనే విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: