తమిళంలో వచ్చిన సినిమాతో
నారప్ప సినిమా ను పోల్చడం సహజం. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ ను ఇప్పటికీ అందరూ చూసి ఉంటారు. దాన్ని మనసులో ఉంచుకొని ఈ
సినిమా చాలా మంది చూడబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి నటుల నటన లో తారతమ్యాలు చిత్రీకరణలో బేధాలు సరి పోల్చడం సహజం. ఇన్ని సవాళ్ళ మధ్య ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి
అసురన్ సినిమా తో పోలుస్తూ నెటిజన్లు కొన్ని కామెంట్లు పెడుతున్నారు.
ముఖ్యంగా
తండ్రి పాత్రలో
వెంకటేష్ గెటప్ ను అందరూ మెచ్చుకున్నా కొడుకు పాత్రలో
వెంకటేష్ ఎలా సెట్ అవుతాడు అన్న కామెంట్ లు చేస్తున్నారు. ట్రైలర్ గమనిస్తే
వెంకటేష్ ముసలి పాత్రలో మరియు యంగ్ వయసు పాత్రలో కూడా కనిపించడం మనం చూశాం. ఈ నేపథ్యంలో ఈ రెండు పాత్రల్లో
వెంకటేష్ ఏవిధంగా ఇమడగలడు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ
సినిమా వచ్చిన తర్వాత కా నీ
వెంకటేష్ సినిమా లో ఏ విధం గా నటించాడు ఈ విధంగా ప్రేక్షకులను అలరించారు చెప్పడం కష్టం. నటుడిగా ప్రేక్షకులను 100% సంతృప్తి పరిచే నటుడు
విక్టరీ వెంకటేష్.