టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచిన విషయం తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సిటీ మార్ ముందుగా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కబడ్డీ ఆట నేపథ్యంలో ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది అని తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టురి నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం ఈ సినిమాకి హైలెట్ గా నిలవనుంది.
ఈ చిత్రం తర్వాత గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేయబోతున్నాడు రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా గోపీచంద్ కోసం మారుతి రెడీ చేసిన పక్కా కమర్షియల్ సినిమా ఇది. ఈ సినిమా నీ రవితేజ రిజెక్టు చేయగా గోపీచంద్ చేస్తున్నాడు. మారుతీ స్టైల్ లో హండ్రెడ్ పర్సెంట్ కామెడీతో గోపీచంద్ స్టైల్ లో ఎంత కమర్షియల్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుందట.
ఇక గోపీచంద్ ఇటీవలే శ్రీవాస్ దర్శకత్వంలో తన మూడవ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు వీరు. వాస్తవానికి శ్రీవాస్ బాలకృష్ణతో సినిమా చేయనున్నాడని వార్తలు షికార్లు చేసాయి. కానీ సడన్ గా గోపీచంద్ తో సినిమా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బాలకృష్ణ తో చేసిన డిక్టేటర్, బెల్లంకొండ శ్రీనివాస్ తో తీసిన సాక్ష్యం సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోవడంతో గోపీచంద్ తో సినిమా చేసి హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లో కి రావాలని చూస్తున్నాడు శ్రీవాస్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి