టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్సినిమా చేయాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో  వెంకీ నటించిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించాడు.కానీ త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత వెంకీ తో ఇప్పటివరకు సినిమా చేయలేదు.అయితే ఆ మధ్య వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.అంతేకాదు వెంకటేష్ నారప్ప, దృశ్యం2,ఎఫ్3 సినిమాల తర్వాత తన లాండ్ మార్క్ మూవీ 75 వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని వెంకీ ఫిక్స్ అయ్యాడని వార్తలు వచ్చాయి. దీంతో వీరి కాంబో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇంక లేనట్లే అని తెలుస్తోంది.గతంలో త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.కానీ అది వర్కౌట్ కాలేదు.ఇప్పటికే వెంకటేష్.. త్రివిక్రమ్ తో 'జాలీ ఎల్ ఎల్ బి2' సినిమాని రీమేక్ చేయాలని అనుకున్నారు.కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు.అంతేకాదు ఇప్పుడు ఆ రీమేక్ గురించి వెంకీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.ఇక తాజాగా నారప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగాత్రివిక్రమ్, తరుణ్ భాస్కర్ ల ప్రాజెక్ట్స్ గురించి అడిగితే,'ఏది మన చేతుల్లో లేదమ్మా'అని చెప్పారు.తరుణ్ భాస్కర్ ఇంకా ఏదో రాస్తున్నాడని చెప్పిన వెంకీ మామా.. త్రివిక్రమ్ గురించి మాత్రం చర్చించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

అటు మరోపక్క త్రివిక్రమ్ మాత్రం వరుస ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబుతో తమ నెక్ట్స్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దాని తర్వాత రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్వంటి హీరోలతో తన తరువాతి సినిమాలు ఉండే అవకాశం ఉంది.ఇక వెంకటేష్ విషయానికొస్తే.. తాను తాజాగా నటించిన నారప్ప సినిమా ఈ నెల 20 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇక దీంతో పాటు ఇప్పటికే మలయాళ రీమేక్ దృశ్యం2 రీమేక్ షూటింగ్ సైతం పూర్తి చేశాడు.ఈ సినిమా కూడా ఓటిటిలోనే రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.ఇక దాంతో పాటు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్3 లో నటిస్తున్నాడు వెంకీ. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: