నిన్నటిరోజున అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘నారప్ప’ మూవీకి ఓటీటీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. రాయలసీమ గ్రామీణ వాతావరణ నేపధ్యంగా దాదాపు 40 -50 సంవత్సరాల క్రితం పరిస్థితుల నేపధ్యంలో తీయబడ్డ ఈమూవీలోని సీన్స్ చూసిన ప్రేక్షకులకు ఆ సీన్స్ అన్నీ ఎదో ఒక పాత సినిమాలోవి అన్నతీరును కలిగి ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఈ సినిమాలోని చాల సీన్స్ తమిళనాడు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే లా ఉండటంతో ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి మిశ్రమ స్పందన ‘నారప్ప’ మూవీకి వస్తుందని ముందుగానే ఊహించిన సురేష్ బాబు ఈమూవీని అమెజాన్ సంస్థకు అమ్మి సేఫ్ గేమ్ ఆడాడు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి.


ఈసినిమాను ప్రమోట్ చేస్తూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడికి ‘బ్రహ్మోత్సవం’ పరాజయం పై కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ‘బ్రహ్మోత్సవం’ మూవీ తాను అనుకున్నట్లుగా తీయలేకపోయానని శ్రీకాంత్ అడ్డాల కామెంట్ చేసాడు. అంతేకాదు ఆమూవీ కథలో షూటింగ్ సమయంలో చేసిన అనేక మార్పులు ఆ మూవీ పరాజయానికి కారణం అయ్యాయి అంటూ అభిప్రాయ పడ్డాడు.


ప్రస్తుతం ‘నారప్ప’ కి వస్తున్న రివ్యూలను చూస్తుంటే ఈమూవీ కూడ శ్రీకాంత్ అడ్డాల కు ఏమాత్రం కలిసి వచ్చేలా కనిపించడం లేదు. తమిళ సినిమా ‘అసురన్’ ను తెలుగులో శ్రీకాంత్ అడ్డాల కేవలం జరాక్స్ కాపీలా మాత్రమే తీసాడని ఏమాత్రం క్రియేటివిటీ లేదని విమర్శకుల కామెంట్స్. ఇప్పటికే ‘అన్నాయ్’ అంటూ కొత్త సినిమాను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమాను భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ తో మూడు పార్ట్ లుగా తీయాలని ప్రయత్నిస్తున్నాడు. గుంటూరు నేపథ్యంలో ఉండే ఈమూవీ కథ ఫైనల్ అయినప్పటికీ ‘నారప్ప’ ఫలితంతో అరవింద్ శ్రీకాంత్ అడ్డాలతో సాహసం చేస్తాడా అన్నది సమాధానం లేని ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: