టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ హీరోగా నటించిన నారాప్ప సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించగా తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా కి ఇది రీమేక్ గా తెలుగులో తెరకెక్కి సంచలన విజయాన్ని అందుకుంది. వెంకటేష్ నటనకు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు అని అంటున్నారు.

హీరోయిన్ గా ప్రియమణి నటించగా,  రాజీవ్ కనకాల మరియు కార్తిక రత్నం ఇద్దరూ కీలక పాత్ర లు పోషించారు.  కాగా ఈ సినిమా లో మరొక ముఖ్య పాత్ర సీనప్ప. ముందు నుంచి సీనప్ప గురించి ఎవరు ప్రచారంలో మాట్లాడలేదు కానీ సినిమా విడుదలయ్యాక మాత్రం వెంకటేష్ తర్వాత ఈ సీనప్ప గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నారప్ప సినిమా లో తన అన్న ను కళ్ళముందే చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునే యువకుడిగా సీనప్ప అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత తండ్రితో పాటు సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ నటన లో అందరినీ ఆకట్టుకున్నాడు. 

ఈ పాత్ర చేసిన యువకుడి పేరు గీతాకృష్ణ. అందరు ముద్దుగా రాఖీ అని కూడా పిలుస్తుంటారు. ఇటీవలే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తిచేసిన గీతాకృష్ణ ఒక ఛానల్ ఇంటర్వ్యూ కి వచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఈ సినిమా లో నటించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడగగా ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నాను అని సమాధానమిచ్చాడు. తన తల్లిదండ్రులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో తనకు అవకాశం రావడానికి తన అన్నయ్యే కారణం అంటూ చెప్పుకొచ్చాడు. కొన్ని సినిమాలలో నటించినా ఎడిటింగ్ లో పోయాయి అన్నాడు. ఈ సినీమా కంటే ముందు రంగస్థలం సినిమాలో చిన్న పాత్ర పోషించినట్లు వెల్లడించారు. ఈ సినిమా చేస్తున్నంతసేపు దర్శకుడు, హీరో తనకు బాగా సపోర్ట్ చేశారు అని చెప్పుకొచ్చాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో హీరో వెంకటేష్ నటన చూసి చాలా సార్లు కన్నీళ్లు వచ్చాయని చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: