టాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు అలనాటి నటి జయంతి కన్నుమూయడం. కమలాకుమారి నుంచి జయంతి గా ఆమె ప్రయాణించిన తీరు అసామాన్యం ఓ సాధారణ కుటుంబంలో జన్మించి ఇంత గొప్ప స్థాయికి వచ్చిన మహిళగా ఆమె ఎంతో మందికి స్ఫూర్తిని కలిగిస్తుంది. క్లాసికల్ డాన్సర్ గా రాణిస్తున్న ఆమె సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా అవకాశాలకోసం ప్రయత్నిస్తుండగా ఆమె లావు గా ఉందన్న కారణంతో ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. 

దాంతో ఆమె బరువు తగ్గే ప్రయత్నం చేసింది. కన్నడ దర్శకుడు కొత్త సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తుండగా రిహార్సల్స్ హాల్ లో ఆమెను చూసి ఏకంగా ఆమెకు లీడ్ రోల్ ఇచ్చేశాడు. అలా ఆమె పేరును జయంతి గా మార్చేశాడు. ఆ విధంగా కన్నడ సినీ పరిశ్రమ లో 1963లో జైనుగుడు సినిమాతో పరిచయమైన ఆమె ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆమె చేసిన తొలి సినిమానే సూపర్ హిట్ అయి ఆమెకు గొప్ప పేరు రావడంతో డైరెక్టర్లు క్యూకట్టారు ఆమెకోసం. చేసిన రెండో సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి అది కూడా ఓ ట్రెండ్ సెట్ చేసిన హిట్ కావడం విశేషం.

గోల్డ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ సినిమా లకే గ్లామర్ తెచ్చిపెట్టింది.  దాంతో జయంతి కలల రాణిగా మిగిలిపోయింది అప్పటి యూత్ కి.  సౌత్ సినిమాల్లో స్టార్ గా కొనసాగుతున్న టైంలోనే కన్నడ తమిళ తెలుగు సినిమాలలో అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. ఈమె సినిమా జీవితం ఎన్నో గొప్ప గొప్ప మైలురాయిగా సృష్టించగా వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతో విషాదకరంగా కూడుకున్నది అని చెప్పవచ్చు. డాక్టర్ రాజకుమార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ఈమె పేకేటి శివరామ్ దర్శకుడి వివాహం చేసుకోగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత మరో ఇద్దరు పెళ్లి చేసుకున్న కూడా ఆమె వైవాహిక జీవితం సంతృప్తిని ఇవ్వక చివరి దాకా ఒంటరిగానే తన జీవితాన్ని కొనసాగించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: