ప్రముఖ టాలీవుడ్ నటుడు జె.డి.చక్రవర్తి బొంబాయి ప్రియుడు, గులాబీ, దేయ్యం వంటి సినిమాలతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోగా నటించిన ఈ నటుడు. జోష్ సినిమాతో విలన్ గా కూడ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమా కెరియర్ పరంగా కొంచెం స్లో అయిన ఈ నటుడు ఈమధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తి కరమైన కామెంట్లు చేశాడు. అందులో భాగంగా యాంకర్ మీకు చాలా పొగరు అంట కదా అందుకే కెరియర్ స్లో అయిందా ..? నేను పొగరుతో తీసుకున్నా, నా జిగర్తో తీసుకున్న అది నా నిర్ణయం దాని పొగరు అనుకోకూడదు అది నా కాన్ఫిడెన్స్ నా కాన్ఫిడెన్స్ ఎదుటివారికి పొగరుల కనిపిస్తుంది.


 నేను ఒకసారి abn రాధాకృష్ణ ముందు  కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను. అది చూసిన రాధాకృష్ణ ఏంటి జె డి చక్రవర్తి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు ఇదే ఏమైనా పద్ధతేనా పొగరుగా లేదా అని అన్నారు, దానికి నేను నా తొడ మీద నేను కాలు వేసుకోవడం పొగరు అని నాకు ఇంతవరకు తెలియదు అది నా కంఫర్ట్. మీ తొడ మీద నా కాలు వేస్తే అది పొగరు అని నేను అనుకుంటున్నాను. ఇది నా ఆటిట్యూడ్ అని చెప్పాడు. దానితో యాంకర్ మీ తోటి వయస్సు వ్యక్తులతో ఉన్నప్పుడు అలా చేస్తే తప్పు కాదు కానీ ఉదాహరణకు దాసరి నారాయణరావు, రాఘవేంద్ర రావు లాంటి వయసులో పెద్ద దర్శకుల ముందు కూడా మీ ప్రవర్తన ఇలాగే ఉంటుందా అని అడగ్గా..? నేను ఒకవేళ దాసరి నారాయణ రావు దగ్గరికి వెళితే ఏం దాసరి అంటె తప్పు.. అంతేకానీ నా పర్సనల్ పార్టీ మీద నా పర్సనల్ పార్ట్ పెట్టుకుంటే తప్పు ఎలా అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: