తెలుగు చిత్రసీమలో నటి శారద గురించి తెలియని వారుండరంటే అతి శయోక్తి కాదు. నటిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకు ఏ పాత్ర ఇచ్చినా సరే శారద ఇరగదీస్తారనే మంచి పేరు ఆమెకు ఉంది. శారద ఇప్పుడంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి హీరోలకు తల్లిగా చేస్తున్నారు కానీ ఆ కాలంలో ఆమె హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అందరు హీరోలతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. అటువంటి శారదకు దివంగత నటుడు స్టార్ హీరో ఎస్వీ రంగారావు అంటే విపరీతమైన అభిమానం అని మనలో చాలా మంది కి తెలియదు. అటువంటి ఎస్వీ రంగారావుతో కలిసి కూడా శారద నటించింది. వారిద్దరూ హీరోహీరోయిన్లుగా చేసిన మొదటి సినిమా అభిమాన‌వంతులు. అంతే కాకుండా ఎస్వీఆర్ కు కూతురుగా కూడా ఆమె నటించి మెప్పించింది.

జమిందారు గారి అమ్మాయి సినిమాలో ఎస్వీ రంగారావు తండ్రిలా శారద అతనికి కూతురిలా నటించారు. ఇక్కడే మనం ఒక విషయం గురించి చెప్పుకోవాలి. అంతకు ముందు కలిసి చాలా సినిమాల్లో నటించినప్పటికీ రంగారావు, శారదకు పెద్దగా పరిచయం లేదు. కానీ జమిందారు గారి అమ్మాయి చిత్రీకరణలో పాల్గొన్న వీరు చాలా క్లోజ్ అయ్యారు. ఇలా కేవలం పది రోజుల్లోనే క్లోజ్ అయిన వీరిని చూసి చాలా మంది ఈర్ష్య కూడా పెంచుకున్నారట. ఎస్వీ రంగారావు కూడా శారదను ఎప్పుడూ అమ్మాయీ, అమ్మాయీ అని ప్రేమగా పిలిచేవారు. అంతే కాకుండా ఆమెను సొంత కూతురిలా ట్రీట్ చేసేవారని ఒకానొక సందర్బంలో చెప్పింది. ఒకసారి మాట్లో కేళంబాకంలో తనకు ఉన్న గార్డెన్ ను శారదకు ఇస్తానని ఎస్వీఆర్ చెప్పారంట. అలా చెప్పిన కొన్ని రోజులకు ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు. కానీ విచిత్రంగా పదిహేను సంవత్సరాలకు శారద ఆ గార్డెన్ ను కొన్నది. కానీ అప్పటికే గార్డెన్ కు ఉన్న ఎస్వీఆర్ పేరును అలానే ఉంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: