పూజా హెగ్డే నటించిన రెండు సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. దాంతో ఆమెను అందరు సంక్రాంతి మహారాణి గా పిలుస్తున్నారు.

సంక్రాంతి అంటే తెలుగు,తెలుగు సినిమా పరిశ్రమలకి అసలైన సిసలైన పండగ. మిగతా రోజుల్లో ఎన్ని సినిమాలొచ్చినా సంక్రాంతికి విడుదల చేయడంలో ఉండే కిక్కే వేరు అంటారు అందరూ . ఆ సీజన్ ఎన్నీ సినిమాలు వచ్చినా అన్నిటిని చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారనేది పరిశ్రమ పెద్దల విశ్వాసం. పదిహేను రోజులపాటు సాగే ఆ సంక్రాంతి సీజన్లో  మూడు నుంచి నాలుగు సినిమాలు భాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తునే ఉంటాయి దానికి కారణం అదే. అయితే స్టార్స్ సినిమాలు మాత్రం రెండు చిత్రాలకు మించి విడుదల అవ్వవు. అలా రిలీజ్ చేస్తే వసూళ్లకి ఇబ్బంది ఉంటుందనే విషయం తెలుసు కాబట్టి అందరు జాగ్రత్తపడతారు.ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు మరియు మరో చిన్న హీరో సినిమా. వీటికి తోడు ఓ డబ్బింగ్ సినిమా ఇప్పటిదాకా ఇదే విధంగా సంక్రాంతికి సినిమాలు విడుదలవుతూ వచ్చాయి. కానీ వచ్చే పండగకి మాత్రం ఈ విధానం మరో విధంగా మారే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నటి పూజా హెగ్డే నటించిన రెండు సినిమాలు రాబోయే సంక్రాంతికి విడుదల కానున్నాయి.

2020 సంక్రాంతికి పూజా హెగ్డే నటించిన అల వైకుంఠపురములో విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆమె నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు 'రాధేశ్యామ్‌'తోపాటు, 'బీస్ట్‌' (విజయ్ దళపతి ) కూడా విడుదల కానుంది. దాంతో 'సంక్రాంతి మహారాణి' పూజా హెగ్డే నే అని అందరు చెప్పుకుంటున్నారట.

మన స్టార్ హీరోలలో చాలా మంది మనసు సంక్రాంతిపైనే పడినట్లుంది. ఇప్పటికే 'సర్కారు వారి పాట', 'రాధేశ్యామ్‌'తో పాటుగా పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ - రానా నటిస్తున్న 'అయ్యప్పనుమ్‌ కోసియుమ్‌' రీమేక్‌ గా వస్తున్న సినిమాసంక్రాంతి పండక్కి విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది చివరికి పక్కాగా పండగ బరిలో నిలిచే సినిమాలు ఏవి అనేది చాలా ఆసక్తికరంగా మారింది.  కరోనా సెకండ్ వేవ్ మొదలు కాక ముందు వరకూ 2022 సంక్రాంతి బరిలో రెండు సినిమాలే కనిపించాయి. వాటిలో కూడా ఒకటి పవన్‌కల్యాణ్‌ 'హరి హర వీరమల్లు' మరొకటి 'సర్కారు వారి పాట'.

కరోనా తర్వాత అనేక కొత్త చిత్రాలు వస్తున్నాయి . పాన్‌ ఇండియా స్థాయిలో వస్తున్న 'హరి హర వీరమల్లు' స్థానంలో, పవన్‌కల్యాణ్‌ కొత్త చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోసియుమ్‌' రీమేక్‌ జనవరి 12న విడుదల రానుంది.మహేష్‌ 'సర్కారు వారి పాట' ముందుగా చెప్పినట్టుగానే పండగకు రెడీ అయింది., 'రాధేశ్యామ్‌' అస్సలు ఊహించని విధంగా జనవరి 14న అంటూ విడుదల అంటూ తేదీ ప్రకటన చేసింది. దాంతో సంక్రాంతి సినిమాల పోటి చాలా రసవత్తరంగా మారింది. ఇలాంటి మూడు భారీ చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయంటే బాక్సాఫీసు వసూళ్లతో నిండిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: