తెలుగు సినిమా రంగంలో రెండు దశాబ్దాల క్రితం ఒక్కసారిగా మెరుపులా దూసుకు వచ్చింది ఆర్తి అగర్వాల్. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్న‌ టైంలో సురేష్ బాబు ఆర్తి అగర్వాల్ ఫోటో చూసి అమెరికాలో ఉన్న ఆమెను ఇండియా కు రప్పించారు. ఈ క్రమంలోనే నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా అవ‌కాశం వ‌చ్చింది. తొలి సినిమాయే సూపర్ హిట్ కావడంతో ఆమె  ఒక్కసారిగా తెలుగు యువత మదిలో కలల రాణి గా మారిపోయింది. తర్వాత అదే సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటించింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

అక్కడి నుంచి ఆర్తిఅగర్వాల్ వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా నాగార్జున - వెంకటేష్ - బాలకృష్ణ - చిరంజీవి - ఉదయ్ కిరణ్ - తరుణ్ - ఎన్టీఆర్ - మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో వరుసపెట్టి ఛాన్స్ కొట్టేసింది. మళ్లీ ఆ సమయంలోనే లవర్ బాయ్ తరుణ్ తో ఆమె ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. తరుణ్ తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నువ్వు లేక నేను లేను సినిమాలో నటించిన ఆర్తి మరోసారి అదే తరుణ్ పక్కన అదే బ్యానర్ లో సోగ్గాడు సినిమా కూడా చేసింది. ఆ తర్వాత తరుణ్ - ఆర్తి ప్రేమ తరుణ్ తల్లి రోజారమణి కి ఇష్టం లేకపోవడంతో వీరి విడిపోయినట్టు ప్రచారం ఉంది.

తరుణ్ తో బ్రేకప్ తర్వాత ఆర్తి అగర్వాల్ కెరీర్ పూర్తిగా డ‌ల్‌ అయిపోవడం తో పాటు ఆమె ఫేడ్ అవుట్ అయిపోయింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తరుణ్ తో ప్రేమాయణం కంటే కూడా ఆమెకు అవకాశాలు ఇస్తానని ఆశపెట్టి ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆమెను ఇష్టానుసారం వాడుకున్నారని ఇండస్ట్రీలో అంతర్గతంగా ఎన్నో చర్చలు నడిచాయి. ఆర్తి కూడా ఆ స్టార్ ప్రొడ్యూసర్ గెస్ట్ హౌస్ లోనే ఎక్కువగా ఉండేదట. సదరు స్టార్ ప్రొడ్యూసర్ రాంగ్‌ గైడెన్స్ ఇవ్వడంతో ఆయన మాటలు నమ్మి ఆమె కెరీర్ ప‌రంగా రాంగ్ స్టెప్పులు వేసి జీవితాన్ని నాశనం చేసుకుందని అంటారు. అయితే తరుణ్ తో ప్రేమాయణం బ్రేక‌ప్ అవ్వ‌డం కూడా ఆమెను మానసికంగా కుంగదీసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: