'SR కళ్యాణమండపం'కి వచ్చిన బజ్  ఈ మధ్య కాలంలో మరో ఏ సినిమాకి  రాలేదు.  భిన్నమైన ఎమోషనల్ డ్రామా  అంటూ వచ్చిన ఈ సినిమా.. కంటెంట్ పరంగా పర్వాలేదు అనిపించినా... ప్రేక్షకులను మాత్రం   నిరుత్సాహపరిచింది. ఈ సినిమా పరాజయం వెనుక కారణాలు పరిశీలిస్తే..  నాసిరకమైన సీన్స్ తో సాగుతూ.. అనవసరమైన బోల్డ్ సీన్స్ బాగా ఎలివేట్ అవ్వడం సినిమా స్థాయిని  తగ్గించింది.  


అసలు  గ్రిప్పింగ్ నరేషన్ తో కథ చెప్పాల్సిన దర్శకుడు, అవ్వన్నీ వదిలేసి  అర్ధం పర్ధం లేని సీన్స్ ను చూపిస్తూ  సినిమాని ముగించడం  ప్రేక్షకులకు పెద్ద  టార్చర్ అయిపోయింది.  అయినా  ఈ కరోనా కష్ట  సమయంలో   ఒక ప్రేక్షకుడు  థియేటర్ కి వెళ్లి  సినిమాని చూడాలంటే.. ఆ సినిమా ఎలా ఉండాలి..? నిజానికి కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ..   సినిమాలో ఎక్కడా ప్లో లేకపోవడం పెద్ద వెలితి.  


 దీనికితోడు సినిమా ప్రారంభంలోనే అనవసరంగా  ఓవర్  మాస్ ఎలిమెంట్స్ తో విసిగించారు.  సహజంగా ఒక  సినిమాకి  ఒక  మూడ్ ను క్రియేట్ చేయడానికి ఎలివేషన్ షాట్స్ వాడతారు.  కానీ, సాధారణ  హీరో మీద  మాస్ ఎలివేషన్ షాట్స్ వాడి  ఈ సినిమా మూడ్ ను   చెడగొట్టాడు దర్శకుడు.  అయినా కథలోకి తీసుకెళ్లేందుకు మంచి  సీన్స్ రాసుకోవాలి. 

కానీ,   అడ్డమైన సీన్స్ ను రాసుకుంటూ పోతే  స్క్రీన్ ప్లే సక్రమంగా ఎలా వస్తోంది ?   హీరో హీరోయిన్ మధ్య వచ్చే   సీన్స్ లో  లవ్ కంటే కూడా  పూరి సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది.   అయితే, సినిమాలో   ఫాదర్ ఎమోషన్ తో  కథ ఊపందుకున్న మాట వాస్తవం.  కానీ, ఆ ఎమోషన్ లో కూడా   అనవసరమైన సీన్స్ తో మళ్ళీ సినిమాని బోరింగ్ ప్లేతో సాగదీస్తూ.. మొత్తానికి సినిమాని ప్లాప్ దిశగా తీసుకువెళ్లారు.   
 

స్టార్ అయ్యే  మంచి ఛాన్స్  ను  కిరణ్  అబ్బవరం  మిస్ చేసుకున్నాడు.  సినిమా హిట్ అయి ఉంటే.. కిరణ్ రేంజ్ మారిపోయేది. కానీ సినిమా ప్లాప్ తో అసలుకే మోసం వచ్చింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: