పవర్ స్టార్ పవన్ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. మూడు విభిన్నమైన కథాంశాలతో ఆ సినిమాలు తెరకెక్కిస్తు ఉండగా వాటి ద్వారా అభిమానులను ఎంతగానో అలరించాలని చూస్తున్నాడు. ఇక
మెగాస్టార్ చిరంజీవి కూడా తమ్ముడు కి ఏ మాత్రం తగ్గకుండా మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు. రాజకీయపరంగా వీరిద్దరి అభిప్రాయాలు వేరైనా సినిమాల పరంగా వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరు అన్నదమ్ముల దారి ఒకటే గమ్యం అలాంటి. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి అని గతంలో ఎన్నో వార్తలు రాగా వాటన్నిటినీ కొట్టిపారేస్తూ ఎన్నో ఫంక్షన్లకు ఈవెంట్లకు ఒకటిగా హాజరై వారందరి అనుమానాలను
చెక్ పెట్టేశారు.
ఇక తమ్ముడు కి అండగా ఉంటూ తమ్ముడు చేసే తప్పులను కాస్తూ సరైన దారిలో పెడుతూ చిన్నప్పటి నుంచి తమ్ముడికి వెన్నుదన్నుగా ఉన్నాడు
మెగాస్టార్ చిరంజీవి. అలా పవన్ సినిమాల్లో చేసే కొన్ని తప్పులు బయటకు రానీయకుండా తమ్ముడికి తప్పొప్పులు చెబుతూ పవన్
కళ్యాణ్ ఈ స్థాయికి ఎదగడానికి కారణమయ్యాడు. అలా పవన్
కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లక ముందు ఆయన ఓ సినిమాను
రీమేక్ చేయాల్సి ఉంది. అయితే అది కొన్ని కారణాలవల్ల
రీమేక్ కాలేదు. దాంతో తాను ముందుకు వచ్చి ఆ
సినిమా తాను చేస్తాను అని నిర్మాతలకు అభయమివ్వగా వారు సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇంతకీ పవన్ చేయాల్సిన
రీమేక్ సినిమా ఏదనుకొంటున్నారా.
ఇప్పుడు
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న వేదళం రీమేక్. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మాతగా
తమిళ దర్శకుడు నీసన్ దర్శకుడిగా పవన్
కళ్యాణ్ హీరోగా తెరకెక్కిచాల్సి ఉంది కానీ ఆ
సినిమా పట్టాలెక్కలేదు. అప్పట్లో పవన్
కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం ఆ తరువాత వెంటనే రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ
సినిమా అలా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయడంతో ఒక్కసారిగా మెగా అభిమానుల్లో ఒక రకమైన ఆనందం నెలకొంది. ఏదేమైనా తమ్ముడు తప్పులను సరిదిద్దు తూ
మెగాస్టార్ చిరంజీవి ఒక రేంజ్ లో తన ఉన్నత భావాన్ని చాటిచెప్పారు.