జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది ఆయన పర్ఫెక్ట్ టైమింగ్. ఆయన ఎప్పుడు వారి తాత గారు అయిన నందమూరి తారక రామారావు గారి బాటలో నడుస్తూ వుంటారు. నందమూరి తారక రామారావు గారు షూటింగ్ సమయానికి ఉదయాన్నే 4గంటలకు బయలుదేరి వచ్చేవారట. ఎప్పుడు టైం ని ఫాలో అవుతువుంటారు. అలాగే డైలాగ్ డెలివరీ లో గాని, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ పండించడంలో గాని ఎన్టీఆర్ తాతకు మించిన మనవడిగా పేరు పొందారు. ఎలాంటి కష్టతరమైన పాత్ర అయిన సింగల్ టేక్ చెప్పే సత్తా వున్నవాడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ అనగానే గుర్తొచ్చేది ఆయన డాన్స్. ఎలాంటి కష్టతరమైన స్టెప్ అయిన సరే చూసిన వెంటనే ఆ స్టెప్ ఎలా ఉంటే అలా ఎలాంటి తప్పు లేకుండా చేసేవారట. ఎన్టీఆర్ ఎనర్జీ చూసి ఆయన కో స్టార్స్ ఆశ్చర్య పోయే వారని సమాచారం.

ఇదిలా ఉండగా బుల్లితెర యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. మొదట ఆయన తెలుగులో బిగ్ బాస్ సీజన్ వన్ కు హోస్ట్ గా చేసారు. ఆ షో తెలుగులో టాప్ trp రేటింగ్ పొందిన రియాలిటీ షో గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వచ్చిన సీజన్స్ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. ఆ తరువాత ఎన్టీఆర్ సినిమాలలో బిజీ అయిపోయాడు. చాలా రోజులకు మళ్ళీ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో హోస్ట్ గా మనముందుకు వచ్చారు. ఈ షో ఆదివారం కర్టన్ రైజర్ మొదలు అయింది. దీనికి మెగా పవర్ స్టార్ రాంచరణ్ గెస్ట్ గా రావడం జరిగింది.ఆదివారం జరిగిన కర్టన్ రైజర్ లో ఎన్టీఆర్ తనదైన శైలిలో చెలరేగిపోయారు. రామ్ చరణ్ చాలా బాగా ఆటను ఆడటం జరిగింది. అంతే కాకుండా ఎన్టీఆర్, రాంచరణ్ గురించి తెలియని విషయాలు అందరికి తెలిసేలా ప్రశ్నలు అడగగా రాంచరణ్ తనదైన శైలిలో జవాబులు ఇచ్చారట.

కర్టన్ రైజర్ ఎపిసోడ్ ను సోమవారం కూడా కంటిన్యూ చేయడం జరిగింది.ఈ ఎపిసోడ్ లో ఒక సందర్భంలో ఇంతకుముందు ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడు అనే టైటిల్ అంతగా బాగోలేదని తనకు అంతగా నచ్చలేదని చెప్పారట. ఈ టైటిల్ లో కోటీశ్వరుడు అనే పదం మగవారిని మాత్రమే సూచిస్తుందని అందుకే తనకు నచ్చలేదని చెప్పారు. అందుకే తాను హోస్ట్ గా చేస్తున్న ఈ షో టైటిల్ మార్చడం జరిగిందట. ఎవరు మీలో కోటేశ్వరులు అనే టైటిల్ ద్వారా మగవారితో పాటు ఆడవారికి కూడా ఇందులో భాగం ఉంటుందని ఈ టైటిల్ మార్చడం జరిగిందని చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: