టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో గోపీచంద్. ఇక ఈయన ప్రస్తుతం నటించిన సినిమా సీటీ మార్.. వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలై మంచి సక్సెస్ ను అందుకుంది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఈ సినిమాకి సంగీతం మణిశర్మ అందించారు. అయితే ఈ సినిమా మొదటి రోజే ఏలాంటి కలెక్షన్లు రాబట్టింది అనేది ఒకసారి చూద్దాం.


దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత గోపీచంద్ కు మంచి సక్సెస్ ను అందించిందని చెప్పవచ్చు ఈ సిటీ మార్ సినిమా. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లలో విడుదల చేశారు. ఇక మార్నింగ్ షోలకే ఈ సినిమా మంచి టాక్ తో హౌస్ ఫుల్ బోర్డులతో అదరగొట్టింది. ఇక ఇదే జోరు ఆ రోజంతా కొనసాగించడం జరిగింది ఈ సినిమా. అందుచేతనే మొదటి రోజే ఎన్నో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా.

ఈరోజు సీటీ మార్ మూవీ 1.8 కోట్ల రేంజిలో ఓపెనింగ్ బిజినెస్ ను రాబట్టింది. ఇక మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర మొత్తం కలెక్షన్లను చూస్తే..3 నుండి 3.3 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించినటువంటి విషయం అధికారికంగా విడుదల కాలేదు. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో విడుదల అయినది కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి తమన్నా తన సొంత వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పి అదరగొట్టింది. ఈ సినిమాలో ముఖ్యంగా జ్వాలా రెడ్డి పాటకు మంచి స్పందన రావడం విశేషం. ఇక ఈ సినిమాలో మరొక బ్యూటీ దిగంగన సూర్యవంశీ కూడా బాగా నటించింది అని చెప్పవచ్చు. ఇక గోపీచంద్ ప్రస్తుత సినిమా విషయానికొస్తే,  డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా  నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: