పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుని హీరోగా తన క్రేజ్ ని మెల్లగా పెంచుకుంటూ అనతికాలంలోనే పవర్ స్టార్ గా ఎంతో గొప్ప క్రేజ్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, జల్సా వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ సినిమాలతో హీరోగా తన స్టామినాని టాలీవుడ్ కి పరిచయం చేసిన పవర్ స్టార్ మధ్యలో కొన్ని వరుస ఫ్లాప్స్ ని కూడా చవిచూడక తప్పలేదు.

అయినప్పటికీ కూడా ఏ మాత్రం అధైర్యపడకుండా కెరీర్ పరంగా ముందుకు సాగారు పవన్ కళ్యాణ్. ఇక వ్యక్తిగతంగా పవన్ ని కలిసిన ప్రతి వారు చెప్పే మాట ఒక్కటే, ఆయన ఎంతో సౌమ్యుడు, మృదు స్వభావి, మరీ ముఖ్యంగా ఎంత ఎదిగినప్పటికీ కూడా ఒదిగి ఉండే మంచి మనస్తత్వం గల వ్యక్తి అని. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మొన్న పెళ్లి చూపులు దర్శకడు తరుణ్ భాస్కర్ తన టీమ్ తో కలిసి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్ కి వెళ్లగా అక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందట.

లైట్ బాయ్ దగ్గరి నుండి ప్రతి ఒక్కరినీ ఎంతో సౌమ్యంగా పలకరించి మాట్లాడడంతో పాటు ప్రత్యేకంగా ఇంటి నుండి తెప్పించుకుని తినే పోషకవిలువలు గల ఆహారం, అలానే ఖాళీ సమయంలో పుస్తకం చదువుకోవడం ఇలాంటివి చూసాక అందుకే కాబోలు ఆయనకి అంత గొప్ప పేరు దక్కింది అంటూ పవన్ కలిసిన తరుణ్ భాస్కర్ బృందం అనుకున్నారట. ఏది ఏమైనా ఎంత ఎదిగినా వొదిగి ఉండే మంచి మనసు మన హీరోలు అందరిలో ఉందని అంటున్నారు పలువురు సినిమా ప్రముఖులు, విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: