ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలు ప్రతి వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ బుల్లితెర కార్యక్రమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు  ఇలా ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో షోస్ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.  ఇలాంటి షోస్ లలో అటు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో కూడా ఒకటి.  ప్రతివారం వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది ఈ షో.


 సినిమా ఇండస్ట్రీలోని ఎంతో మంది ప్రముఖులు ప్రతివారం నలుగురు వ్యక్తులు గా క్యాష్ షో లోకి ఎంట్రీ గెస్ట్ లుగా వస్తారు. ఇక సుమ వారందరితో ఫన్నీ టాస్క్ లు చేయిస్తూ అలరిస్తూ ఉంటుంది   ఇక గత వారం ఒకప్పుడు ఢీ షో లో అదరగొట్టిన డాన్స్ మాస్టర్లందరిని కూడా స్పెషల్ గెస్ట్ లుగా పిలిచింది సుమ. ఇక వారితో సుమ చేయించిన టాస్కులు ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకర్షించాయి. ఇక ఇటీవలే ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లను గెస్ట్లుగా పిలిచింది. ఆర్పి పట్నాయక్, కల్యాణి మాలిక్,  ఎస్వీ కృష్ణారెడ్డి, రఘు కుంచే లు క్యాష్ షో లో స్పెషల్ గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే విడుదలైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  అయితే సుమ క్యాష్ షో లో ఎప్పుడూ ఫన్నీ టాస్క్ లు ఉంటాయి అన్నది తెలిసిందే ఈ క్రమంలోనే నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లను పక్కన కూర్చోబెట్టుకుని వారికి గురువుల పాఠాలు చెప్పింది. ఇక ఆర్ పి పట్నాయక్ పాడిన ఒక పాటని తనదైన శైలిలో పాడి పాడి చూపించు అంటూ అడుగుతుంది.  ఇక ఆర్పి పట్నాయక్ ఆ పాటను అద్భుతంగా పాడాడు వెంటనే కన్నీళ్లు తుడుచుకున్న సుమా ఏంటో నా శిష్యుడు నాకంటే బాగా పడుతున్నాడు అంటూ పంచు వేస్తుంది దీంతో అందరు నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: