టాలీవుడ్లో ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో మంచి కం బ్యాక్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇప్పుడు ఏకంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పండే హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఈసినిమాతో విజయ్ బాలీవుడ్ కి.. అనన్య పాండే టాలీవుడ్ కి ఒకేసారి పరిచయం అవుతున్నారు.ఇక పూరీ జగన్నాథ్ తో పాటుగా ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు చిత్ర యూనిట్.ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ని గోవా లో ప్లాన్ చేశారు.సెప్టెంబర్ 30 తో గోవా షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది.ఇక ఇదిలా ఉండగా  సెప్టెంబర్ 28 న పూరీ జగన్నాథ్ పుట్టినరోజు.ఈ సందర్భంగాఆ రోజున లైగర్ సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.నిజానికి ఈ సినిమా టీజర్ ను విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9 నే రిలీజ్ చేయాలని అనుకున్నారు.కానీ కరోనా కారణంగా విడుదల చేయలేకపోయారు.ఇక అప్పటి నుండి పూరీ-విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.సినిమాలో విజయ్ కి తల్లిగా ఆమె నటిస్తున్నారని టాక్.

అయితే పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా లైగర్ టీజర్ తో పాటు మరో కొత్త అప్డేట్ కూడా రానుందని అంటున్నారు.టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో పూరీ జగన్నాథ్ ఓ సినిమా చేయాలని గత కొంతకాలంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో పైసా వసూల్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికి..సినిమాలో పూరి జగన్నాథ్ బాలయ్యను చూపించిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ బర్త్ డే అయిన సెప్టెంబర్ 28 న బాలయ్య తో పూరి చేసే ప్రాజెక్ట్ గురించి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: