సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రిపబ్లిక్ ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఒక పవర్ఫుల్ అవినీతిని ఎదుర్కునే కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త సాయి ధరమ్ తేజ్ ని వెండి తెరపై చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే దేవా కట్ట లాంటి ఒక పవర్ఫుల్ దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గానే జనాల ముందుకు వదిలారు. ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ కలెక్టర్ పాత్రలో కనిపించిన సాయి ధరమ్ తేజ్ ఈ ట్రైలర్ తో మెప్పించాడు. అలాగే రిపబ్లిక్ సినిమాపై కూడా అంచనాలను పెంచేలా ఈ ట్రైలర్ ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ తాజాగా భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, మరి కొంతమంది సినీ పెద్దలు కూడా విచ్చేశారు. అయితే ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలోని అత్యంత సన్నిహితుల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. నన్ను అన్నయ్యా .. అన్నయ్యా అని సాయి ధరమ్ తేజ్ పిలుస్తూ ఉంటాడు. మా ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంది అని గోపిచంద్ మలినేని తెలిపాడు. ఇండస్ట్రీలో వెరీగుడ్ హ్యూమన్ బీయింగ్ ఉన్న వ్యక్తి ఎవరంటే  అనే చెప్తాను. నాకు సాయి ధరమ్ తేజ్ అత్యంత ఆప్తుడు. సాయి ధరమ్ తేజ్  అను నేను చాలా దగ్గరనుండి గమనించాను. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మిక్స్ చేస్తే తేజ్. వాళ్ళిద్దరు నుంచి స్టైల్ ను డాన్స్ ను సాయి ధరమ్ తేజ్  పుణికిపుచ్చుకున్నాడు. అని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: