తెలుగులో ఫ్యాక్షనిజం చిత్రాలు అంటే గుర్తొచ్చే మొదటి హీరో బాలయ్య. పవర్ఫుల్ డైలాగులకు ఈయన పెట్టింది పేరు. కెరీర్ ప్రారంభంలో పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించగా...ఆ తర్వాత ఎక్కువగా లవ్ డ్రామా చిత్రాలను కూడా చేశారు. అనంతరం ఈ సీనియర్ హీరో ఫ్యాక్షన్ కథలను ఎంచుకుంటూ పవర్ఫుల్ హీరోగా ఫ్యాక్షనిజం చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఈయన సినిమా వస్తుంది అంటే చాలు ఇక మాస్ ఆడియన్స్ కి పండగే. నట సార్వభౌమ నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య టాలెంట్ తో స్వతహాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు బాలయ్య. అరిస్తే సుమోలు గాల్లోకి ఎగరడం డైలాగులు బాంబుల్లా పేల్చడం ఈ హీరో స్పెషాలిటీ.

బాలయ్య డైలాగ్ చెప్పాడంటే ఒక్కో డైలాగ్ బాణం లా గుచ్చుకోవాల్సిందే. సమరసింహా రెడ్డి, సీమ సింహం, చెన్నకేశవరెడ్డి, పల్నాటి బ్రహ్మ నాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో తన పవర్ ను చూపించారు నందమూరి బాలకృష్ణ. ఫ్యాక్షన్ డ్రాప్ లో చిత్రాలు తెరకెక్కించాలి అంటే ఇప్పటికి బాలయ్య దర్శకులకు మొదటి ఆప్షన్ గా ఉన్నారు అంటే ఆయన చూపులోని పవర్, డైలాగ్ లోని పదును, ముఖంపై ఆ గాంభీర్యం అంతకుమించిన యాక్షన్ ఆయన సొంతం అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ డ్రాప్ లో ఎన్నో వందల చిత్రాలు తెరపైకి రాగా ఫ్యాక్షన్ అనగానే గుర్తొచ్చే మొదటి హీరో బాలకృష్ణ.

రాను రాను ట్రెండ్ మారుతూ పోతున్న బాలకృష్ణ మాత్రం ట్రెండ్ ఏదైనా ఫ్యాక్షన్ కథలు తన దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఒప్పుకుని చేస్తాడు. ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఫ్యాక్షన్ కథలంటే మహా ఇష్టం. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వరుసగా మూడవ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: