బాహుబలి సినిమా తో ప్రపంచమే గర్వించదగ్గ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు గడించిన ఎస్.ఎస్.రాజమౌళి.. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న చిత్రం 'రౌద్రం రణం రుధిరం'. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. దాదాపు పది భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. అసలైతే అక్టోబర్ 13 నే సినిమా విడుదల కావాలి.. 

కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి భారీ ప్లాన్స్ వేసినట్లుగా తెలుస్తోంది. నవంబర్లో ఈ సినిమా టీజర్ విడుదల కానుందని తెలుస్తుండగా.. అక్కడినుండి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా తారా స్థాయికి చేర్చడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయిలో ప్లాన్ చేసే విధంగా మూవీ టీం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

దాదాపు అన్ని భాషలు కవర్ అయ్యేలా చేస్తూ ప్రచారం చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. ఇక కేవలం ఈ సినిమా పబ్లిసిటీ కోసమే భారీగా బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సుమారు కొన్ని పదుల కోట్లు ఈ సినిమా పబ్లిసిటీ కోసమే ఖర్చు చేయనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్, దేవగన్ శ్రీయ శరణ్ సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR