
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రొమాంటిక్. కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా కథ స్క్రీన్ ప్లే మాటలు పూరి జగన్నాథ్ అందించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాగా అది ప్రేక్షకులను ఎంతగానో ఫిదా చేసి సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశాయని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు తరలిరావడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అవుతుంది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రభాస్ స్వయం గా వచ్చి చిత్ర యూనిట్ ను ఇంటర్వ్యూ చేసి సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకోగా ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ రావడం కూడా ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో క్రేజ్ చాలా ఉందనే చెప్పాలి. వరంగల్ లో జరిగిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత ఈ సినిమా ప్రమోషన్ గట్టిగానే చేసింది చిత్ర బృందం.
ఈ 29వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అనుకుంటున్నారు. ఇక తాజాగా మరో స్టార్ ఈ సినిమా చూసి మంచి రివ్యూ ఇచ్చారు. టాలీవుడ్ లో దర్శకధీరుడు గా జక్కన్న గా పేరుగాంచిన రాజమౌళి ఈ చిత్రాన్ని చూసి చిత్రానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సినిమా చాలా బాగుందని తప్పకుండా ప్రేక్షకులను అందరినీ ఆదరిస్తుంది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా అని ఆయన చెప్పారు. ఒక టాప్ దర్శకుడు ఇలాంటి రివ్యూ ఇవ్వడం తో ఒక్కసారిగా సినిమా పట్ల అందరిలో ఇంట్రెస్ట్ కలిగించింది అని చెప్పవచ్చు. మరి రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలంటే రేపు మొదటి షో పడే వరకు ఆగాల్సిందే.