దసరా తర్వాత తెలుగునాట మరొకసారి పండుగ వాతావరణం నెలకొంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న దీపావళి పండుగ సమయంలో అంతకంటే ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాలు విడుదల అవుతూ ఉండడం అందరినీ మరింత ఆసక్తి కలిగించే విషయం. సినిమాల విడుదల మాత్రమే కాకుండా పండుగ సందర్భంగా పెద్ద హీరోల సినిమాల అప్డేట్ లు కూడా విడుదలయ్యే విధంగా ఉండడం తో అందరికీ ఈ దీపావళి ఎంతో స్పెషల్ గా ఉండ బోతుంది. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ తమ సినిమా అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఆ విధంగా ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల సర్ప్రైజ్ లు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి.

సంక్రాంతి సందర్భంగా రాబోయే చిత్రాల టీజర్ లు పోస్టర్ లు పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తు ఉండగా స్పెషల్ అప్డేట్లు ఈ దీపావళి సందర్భంగా ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నాయి. వాటిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్లు ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క స్పెషల్ టీజర్ ను దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చెప్తుంది.

పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్లు విడివిడిగా ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉన్న ఓ టీజర్ ను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సినిమాపై భారీ అంచనాలు ఏర్పాటు చేయాలని చిత్రబృందం భావిస్తోంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు త్రివిక్రమ్ అందిస్తుండగా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు పోటీగా మూడు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తెలుగులో విడుదల అవుతున్నాయి వీటన్నిటి మధ్య ఈ సినిమా ఏ రేంజిలో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: