టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్ అని అందరికీ తెలుసు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని తెలుస్తుంది.

జనవరి 7, 2022 న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం అయితే అంచనాల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ కు సుమారుగా 450 కోట్లు ఉండవచ్చు తెలుస్తుంది. ఇక డిసెంబర్ 9న ఈ సినిమా ట్రైలర్ రాబోతోందని తెలుస్తుంది.

ఆ ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాలలోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతున్నారట చిత్రబృందం.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో అలియా భట్ పాత్రకు సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేశారట చిత్ర బృందం. ఈ వీడియోలో అలియా నుంచి సీతగా మారే విధనాన్ని చూపించారట. అందులో ఆలియా పోషిస్తున్న సీత పాత్రను తయారు చేసే విధానం,యాక్టింగ్ సీన్స్ ను చూపించారట. ఇందులో ఆలియాభట్ క్యూట్ క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ముచ్చటగా కనిపించిందట..

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని తెలుస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెర్రీ అభిమానులు మరియు తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారట. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మరియు పాటలు ఈ సినిమాపై మరింత హైప్ ను పెంచాయని తెలుస్తుంది.కాగా వీటికి అనూహ్యమైన స్పందన వస్తోందని సమాచారం.ఆర్. ఆర్. ఆర్ లో అలియా కనిపించేది కేవలం 30 నిమిషాలు మాత్రమేనని తెలుస్తుంది. ఆ 30 నిమిషాలు తనదైన నటనతో మెప్పించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: