జనవరి 7న రిలీజ్ అవుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. నేషనల్ వైడ్ గా భారీ అంచనాలతో వరల్డ్ వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇవి చాలదు అన్నట్టు టాలీవుడ్ స్టార్ హీరో రానాతో ఆర్.ఆర్.ఆర్ టీం స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్ సీక్రెట్స్ తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్న రానా.. దానికి తోడు తమ సినిమా ప్రమోషన్ కు ఇది ఉపయోగపడుతుందని రాజమౌళి అలా ఫిక్స్ అయ్యారట.

ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇద్దరు రియల్ ఫ్రీడం ఫైటర్స్ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీం జీవితాల కల్పిత కథతో వస్తుంది. కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడని తెలుస్తుండగా.. అల్లూరి సీతారామరాజుగా చరణ్ అదరగొట్టాడని అర్ధమవుతుంది. ఈ క్రమంలో సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలను మించే ఉండగా వాటికి తగినట్టుగా ఇంకాస్త డీటైల్స్ రాబట్టేలా రానా ఇంటర్వ్యూ ఉంటుందని టాక్.

ఆర్.ఆర్.ఆర్ టీం తో కలిసి రానా చేసే స్పెషల్ చిట్ చాట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. సినిమా గురించి మరిన్ని డీటైల్స్.. హీరోలిద్దరి ఇంట్రడక్షన్ సీన్స్.. ఇంటర్వల్.. క్లైమాక్స్ లాంటి విషయాల గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రస్థావిస్తారని తెలుస్తుంది. ఈ ఇంటర్వ్యూ కూడా రాజమౌళి ప్లానింగ్ ప్రకారమే అంటున్నారు. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ స్పెషల్ భారీ ఈవెంట్ హైదారాబాద్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి. నందమూరి బాలకృష్ణ గెస్టులు గా రాబోతున్నారని టాక్. అదే జరిగితే మాత్రం మెగా నందమూరి ఫ్యాన్స్ కు ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కన్నుల పండుగగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మెగా నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసుకునేలా సినిమా ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: