సాయి పల్లవి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ లకు సైతం టఫ్ పోటీ ఇస్తూ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది. సాయి పల్లవి గురించి అందరికి తెలిసిందే..కాంట్రవర్సీలకు వెళ్లదు..లవ్ ట్రాక్ లు నడపదు.. వల్గర్ సీన్స్ చేయదు..ఎక్స్ పోజింగ్ అసలకే చేయదు..మరి ఇన్ని లిమిట్స్ పెట్టుకుని కూడా సాయి పల్లవి ఎలా టాప్ హీరోయిన్ గా చేరింది అంటే దానికి కారణం అమ్మడు మొండితనం. ఆమె ఆ పని చేయాలి అనుకుంటే చేస్తుంది వద్దు అనుకుంటే ఎలాంటి పరిస్ధితులు ఎదురైనా చేయదు.

హీరోయిన్స్ అంటే  కేవలం గ్లామర్ పరంగానే చూసే వాళ్లకి సాయి పల్లవి గట్టి సమాధానమిస్తూ ఎక్స్ పోజింగ్ చేయకుండా కేవలం  నటనతో..డ్యాన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని..ఎటువంటి రీమార్క్ లేకుండా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది అంటే గ్రేట్ అనే అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఇప్పటి వరకు మీరు సాయి పల్లవి సినిమాలు చూసిన్నట్లైతే..ఆమె ఎక్కడ వల్గర్ సీన్స్ లో నటించలేదు..హద్దు మీరే సీన్స్ చేయలేదు.. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని తోడలు చూయించలేదు..పద్ధతిగా నిండైన వస్త్రాధారణతో నే హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

ఇక రీసెంట్ గా రిలీజైన నాని హీరోగా నటించిన శ్యాం సింగరాయ్ సినిమాలో కూడా ఎక్కడ తన లిమిట్స్ క్రాస్ చేయకుండా కేవలం నటనతో తన ఎక్స్ ప్రేషన్స్ తోనే సినిమాను మరో మెట్టు ఎక్కించి సినిమా హిట్ కి ప్రధాన కారణమైంది. ఇక సాయి పల్లవి చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ బాలీవుడ్ లో సినిమా అవకాశం వస్తే తప్పక చేస్తా అంటుంది. కానీ ఇక్కడ అభిమానుల డౌట్ ఏమిటంటే ఇక్కడ పద్ధతిగా కనిపించిన సాయి పల్లవి బాలీవుడ్ లో కి వెళ్లగానే ఎక్స్ పోజింగ్ అంటూ హాట్ గా కనిపిస్తుందా..? అని అంటున్నారు. బాలీవుడ్ లో ఎక్స్ పోజింగ్ చేయకుండా నెట్టుకు రావడమే కష్టమే అని కూడా అంటున్నారు. మరి సాయి పల్లవి ఏం చేస్తుందో చూడాలి..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: